Health

అధిక బరువుతో బాధపడేవారికి….పవర్ యోగా

ఈ రోజుల్లో యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మానసికంగానూ,శరీరకముగాను ఫిట్ గా ఉంటారు. ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా బరువు సమస్య కూడా అధికంగానే ఉంది. ఆ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అవి ఏ మాత్రం వర్క్ అవుట్ అవ్వవు. అలాంటి వారు పవర్ యోగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

పవర్ యోగాలో కేలరీలు బాగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో తేలికైనది మరియు సమర్ధవంతమైనది. మీ శరీరంలోని అధిక బరువు కరిగిపోవాలంటే, పవర్ యోగా ఆచరించండి. దీనిని మీరు ఇంటి వద్దే చేయవచ్చు. లేదా యోగా తరగతులలో చేరి కూడా ఆచరించవచ్చు.

పవర్ యోగా చేసినప్పుడు శరీరంలో అన్ని భాగాలు కదలికలు ఉండటం వలన కేలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యి తొందరగా బరువు తగ్గుతారు. ఈ యోగాలో ఎక్కువగా సాగతీయటం, వంగటం వంటివి ఉండటం వలన శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారికి పవర్ యోగా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.