హైపర్ ఆదికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కార్యక్రమం కొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పాలి. ఇంచుమించు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక TRP రేటింగ్స్ ముందుకు దూసుకుపోతుంది.గురువారం,శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే అందరూ పనులన్నీ మానుకొని మరీ టివిల ముందు సెటిల్ అయ్యిపోతారు. అప్పుడప్పుడు కొన్ని కంప్లెయింట్స్ వచ్చిన కార్యక్రమం సాఫీగానే సాగిపోతుంది. జబర్దస్త్ కి కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. స్కిట్ రైటర్ గానే కాదు… ఆర్టిస్టుగా కూడా తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే కొన్నిరోజుల క్రితం ఓ ఎపిసోడ్ లో యాంకర్ అనసూయను హగ్ చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.
ఢీ షోలో ఏదైనా డిఫరెంట్ గా చేస్తే ప్రియమణి వచ్చి హగ్ ఇస్తుందని, ఇక్కడెవరూ ఇవ్వడంలేదని ఆది అలుగుతాడు. దాంతో పౌరుషం తెచ్చుకున్న అనసూయ స్టేజ్ పైకి వచ్చి హైపర్ ఆదిని హగ్ చేసుకుంది. మరో సందర్భంలో కూడా… స్వర్గం కనిపించాలంటే ఏంచేయాలిరా అని హైపర్ ఆది తన టీమ్ మెంబర్స్ ను అడగ్గా… వాళ్లు సరిగ్గా రిప్లయ్ ఇవ్వరు.
మళ్లీ తనే అందుకుని అనసూయను హగ్ చేసుకుంటే చాలు. స్వర్గం అదే కనిపిస్తుంది అంటూ పంచ్ వేస్తాడు. ఆపై ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అనసూయను రిక్వెస్ట్ చేయగా… ఆమె తన సీట్లోంచి లేచి నిలబడుతుంది. దాంతో పరుగెత్తికెళ్లిన హైపర్ ఆది అనసూయను కాసేపు అలానే కౌగిలించుకుంటాడు. అయితే హైపర్ ఆది కాసేపటివరకు వదలకపోవడంతో అనసూయ ఇరిటేట్ అయిందట.
కార్యక్రమంలో మామూలుగానే కన్పించిన అనసూయ ఇంటికి వెళ్ళగానే ఆదికి ఫోన్ చేసి చెడ మాడా తిట్టేసిందట. స్టేజి మీద ఉన్నప్పుడు నటించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదని ఏదేమైనా నీ బిహేవియర్ నాకు నచ్చలేదు అంటూ అసహనం వ్యక్తం చేసిందట అనసూయ. ఇదే విషయంలో అనసూయ భర్త కూడా కొంచెం గరమ్ అయినట్టు సమాచారం.
ఇక హైపర్ ఆది ఎంత మొత్తుకున్నా అనసూయ మెత్తబడకపోవడంతో ఈ విషయం మల్లెమాల ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి వరకు వెళ్లిందట. ఆయన ద్వారానే అనసూయకు నచ్చచెప్పే ప్రయత్నం చేయాలని జబర్దస్త్ టీమ్ భావిస్తోందట.