Movies

పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన ప్రభాస్

బాహుబలి సినిమాతో ఆంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వృతి జీవితం గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా కధనాలు వస్తున్నాయి. 38 సంవత్సరాలు ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి జాతీయ మీడియా కూడా అనేక వార్తలను ప్రచురిస్తుంది. ప్రభాస్,అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అనుష్క,ప్రభాస్ ఇద్దరు మా మధ్య ఏమి లేదని మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. అయినా సరే ప్రభాస్,అనుష్క పెళ్లి వార్త ఇప్పటికి ప్రచారంలో ఉంది. ప్రభాస్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ విషయం గురించి ప్రభాస్ స్పందించాడు. వివాహం ఎవరిని చేసుకోవాలా అనేది న వ్యక్తిగత విషయం. దాని గురించి బహిరంగంగా చెప్పటం ఇష్టం లేదు. అయితే వివాహం నిశ్చయం అయ్యాక మాత్రం మీడియాకు ఖచ్చితంగా చెపుతానని ప్రభాస్ ప్రకటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."