మీరా జాస్మిన్ గుర్తు ఉందా ? ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?
నటి మీరాజాస్మిన్ బతుకు ఇపుడు… అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.ఏదో చేసేయాలని ఎక్కడికో వెల్లిపోవాలని కలలు కన్న ఆమె జీవితం ఇలా అవుతుందని ఎవ్వరూ ఊహించనే లేదు.కెరియర్ మంచి రన్నింగ్ లో ఉన్న టైమ్లో ప్రముఖ మాండొలిన్ ఆర్టిస్ట్ రాజేష్ ను లవ్ చేసి త్వరలో మ్యారీజ్ అంటూ అనౌన్స్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.ఆ తర్వాత ఏమైందో ఏమో రాజేష్ కు బ్రేకప్ చెప్పి దుబాయ్ ఐటి ఉద్యోగి అనీల్ జాన్ తైతస్ ను మ్యారీజ్ చేసుకుని దుబాయ్ చెక్కేసింది.అయితే అక్కడ కూడా మీరా లైఫ్ స్టైల్ ఏమంత ఆనందకరంగా లేదు.అప్పటికి కూడా ఇంకా యాక్ట్ చేయాలనే ఆమో ఒకే ఒక కోరిక… ఆమెతో ఏం చేయిస్తుందో కూడా తెలియకుండా చేయించేసింది.
ఎలాగైనా సరే మళ్లీ యాక్ట్ చేయాలనే ఆమె ఇన్ టెన్షన్ ను మాత్రం భర్త అనీల్ తోసి పుచ్చాడు.ఇదే విధానాన్ని అప్పట్లో మాండలిన్ రాజేష్ వెలిబుచ్చాడు కాబట్టే అతనికి అలా బ్రేక్ అప్ చెప్పింది.ఇక భర్త విషయంలో ఊరుకుంటుందా చెప్పండి.
తన కలర్ ఫుల్ డ్రీమ్స్ ను కంటిన్యూ చేయడం కోసం భర్తను వదిలి ఇండియా కొచ్చేసింది.ఐతే ఇక్కడికొచ్చాక ఆమెకు ఆఫర్లు రావడమే పెద్ద సమస్యగా మారింది. రకరకాల కమిట్ మెంట్లకు జడిసి తన తల్లితండ్రుల దగ్గరకు వెల్లిపోయింది.ఆ కమిట్ మెంట్స్ కూడా మరీ దారుణంగా ఉండడంతో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందా అని కుంగిపోయింది.
కొంత కాలం కామ్ గా ఉందామని తన స్వగృహంలో ఉందామనుకుంటే అక్కడ కూడా మీరాకు చుక్కలు కనిపించాయి.ఆమె పేరెంట్స్ ఆమె వ్యవహారాన్ని తప్పుబట్టి ఇంటినుంచి వెల్లగొట్టినంత పనిచేశారు.దీంతో మీరా పరిస్థితి ఇపుడు మరీ దారుణంగా తయారైంది.రంగుల వలలో పడితే జీవితాలు ఎలా తయారౌతాయో మీరా జాస్మిన్ ఎపిసోడ్ ఎక్జాంపుల్ .