రేణు దేశాయ్ రెండో భర్తకి ఎంత పెద్ద కూతురు ఉందో తెలుసా?
టాలీవుడ్ పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రేణు నుంచి అనేక సంకేతాలు వస్తున్నాయి. మొదట తనకు జీవితంలో తోడు కావాలని అనిపిస్తుందని ట్వీట్ చేసి పవన్ అభిమానుల్లో కలకలం రేపింది. ఆ తర్వాత ఒక వ్యక్తి చేతిలో చేయి వేసి ఉన్న ఫోటో పోస్ట్ చేయటంతో రేణు వ్యాఖ్యల వెనక ఉన్న అర్ధం అందరికి తెలిసింది. జీవితాంతం తోడు ఉండే భాగస్వామి దొరికాడని చెప్పింది రేణు. మరోసారి ఎంగేజ్ మెంట్ రింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమెకు కాబోయే భర్త చేతికి ఉన్న నిశ్చితార్ధ ఉంగరం ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. పవన్ అభిమానుల మధ్య ఇదే వాడి వేడిగా చర్చ సాగుతుంది.
ఈ నేపథ్యంలోనే రేణు మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తన ట్వీటర్ అకౌంట్ లో ఒక పిక్ పోస్ట్ చేసి కొన్ని పదాలతో క్యాప్షన్ కూడా రాసింది. ఆ పిక్ లో రేణు కూతురు అధ్యతో పాటు మరొక అమ్మాయి కూడా ఉంది.
అధ్య కంటే కొంచెం పెద్దగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు… రేణు దేశాయ్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూతురట. ఆమె పేరు అంజలిక. ఈ విషయాన్నీ రేణు ప్రస్తావిస్తూ ఇప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు కుటుంబంలో భాగం అయ్యిపోయారు.
వీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలని,సంతోషంగా ఉండాలని,ఒకరికొకరు ఆసరాగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అంటూ పోస్ట్ చేసింది. అధ్య కారణంగానే రేణుకి మొదట అంజలిక ఆ తర్వాత ఆమె తండ్రి పరిచయం అయినట్టు తెలుస్తుంది.
అధ్య స్కూల్ కి రేణు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తీ పరిచయం అయ్యి ఉంటాడని, అది ప్రేమగా మారి ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్ళికి వరకు వెళ్లిందని టాక్. అప్పటికే ఆ వ్యక్తి కూతురుతో ఒంటరిగా బ్రతకటంతో ఇద్దరు దారులు ఒక్కటయ్యాయి. ఆ వ్యక్తి కూతురు అంజలికను రెండో కూతురిగా భావిస్తానని అంటుంది రేణు.