Movies

కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

మంచి రచయిత అయినప్పటికీ అనూహ్యంగా డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టి, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్న కొరటాల శివ గురించి సినీ జనాలకు బానే తెల్సు. మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజీ, లేటెస్ట్ గా భరత్ అను నేను చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎగబాకిన శివ, హిట్స్ కి కేరాఫ్ గా నిలిచారు. బిటెక్ చదివి టాలీవుడ్ గడప లోకి అడుగుపెట్టిన కొరటాల శివ లో మంచి రచయిత వున్నాడు. కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల,రచయితలకన్నా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి, ఆదిశగా అడుగు వేసి, తన సత్తా చాటుతున్నాడు. అందుకే ఆయనవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ .

వరుసగా నాలుగు హిట్స్ కొట్టిన దర్శకునిగా ఈ మధ్య కాలంలో కొరటాల మరో రికార్డ్ సృష్టించారు. ఇక్కడ అతని విజయం వెనుక అయన భార్య వుంది. అవును ప్రతి పురుషుని వెనుకా, ఓ స్త్రీ ఉంటుంది కదా. అలాగే శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవింద. ఆమె చాలా సింపుల్ సిటీ గా వుంటారు. ఆమె లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు.

కొరటాల శివ నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ అన్నీ సమకూర్చిన ఆ దేవుడు ఈ దంపతులకు పిల్లలను మాత్రం ఇవ్వలేదు. అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావనగల ఆమె ఆదిశగా కొరటాలను కూడా ఆమె ప్రోత్సహించింది.ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటె చాలన్నది అరవింద్ ఫిలాసఫీ. పైగా ఆమె రామకృష్ణ పరమహంస భక్తురాలు.

రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది. ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు. ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి,బతకడానికి అవసరమైనది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలని ఆమె సిద్ధాంతం.

అందుకే సంపాదనలో అధికభాగం సమాజ సేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారు. అందులోంచి శ్రీమంతుడు సినిమా కథ పుట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. షూటింగ్ అయిపోయి ఇంటికొచ్చాక శివ, అరవింద ఇద్దరూ ఫోన్ ల స్విచ్ ఆఫ్ చేసేసి, ఒకరికొకరు టైం స్పెండ్ చేస్తూ ఉల్లాసంగా గడిపేస్తారట. డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ భర్తగా జీవితం చాలా బావుంటుందని కొరటాల ఇప్పటికే చాలా సార్లు చెప్పాడంటే ఆ క్రెడిట్ నిజంగా అరవింద కే చెందుతుంది.