Uncategorized

ధోని హెల్మెట్‌పై జెండా ఎందుకు ఉండదు..కారణం ఏమిటో తెలుసా?

ఈ రోజుల్లో క్రికెట్ అంటే అబ్బాయిలకు,అమ్మాయిలకు కూడా క్రేజ్ ఉంది. అబ్బాయిలకు అయితే ఈ పిచ్చి బెట్టింగ్ ల వరకు వెళ్ళిపోతుంది. భారత క్రికెటర్స్ అట ఆడటానికి ముందు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాక కొంతమంది ఆటగాళ్లకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా ఫాలో అవుతారు. అంతేకాక సెంటిమెంట్ గా కొన్ని వస్తువులను ఎంతోగానో గౌరవిస్తారు. ప్రతి క్రికెటర్ హాఫ్ సెంచరీ ఫుల్ సెంచరి కొట్టగానే తల మీద ఉన్న హెల్మెట్ ని తీసి ముద్దు పెట్టుకొని ఆనందంగా సెలబ్రేట్ చేస్తారు. అయితే క్రికెటర్స్ తల మీద ఉన్న హెల్మెట్ ను మీరు ఎప్పుడైనా సమగ్రంగా గమనించారా? ఆ హెల్మెట్ మీద ఏమి ఉంటాయో మీకు తెలుసా? భారత క్రికెటర్స్ ధరించే హెల్మెట్ పైన బీసీసీఐ లోగోతో పాటు భారతీయ జెండా ఉంటుంది.

అందుకే సచిన్, కోహ్లి ఇలా కొంత మంది ఆట మధ్యలో హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ధోని మాత్రం ఆలా చేయటం మీరు ఎప్పుడైనా గమనించారా ? గమనించి ఉండరు. ఎందుకంటే ధోని ఆ విధముగా చేయడు. అసలు ధోని ధరించే హెల్మెట్ మీద జాతీయ జెండా ఉంటుందా? అనేది అందరికి వచ్చే సాధారణమైన ప్రశ్న.

అవును ధోని హెల్మెట్ మీద కేవలం బీసీసీఐ లోగో మాత్రమే ఉంటుంది. జాతీయ జెండా ఉండదు. దానికి ఒక కారణం ఉంది. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971 కింద ధోని క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే.

ఇక దేశం మొత్తం తలెత్తి సెల్యూట్ చేసే జెండాని నేలపైన పడేసి కాలితో తొక్కడం భారతదేశాన్ని అవమానిన్చినట్లే. అయితే ధోని కీపింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి తన హెల్మెట్ ని తీసి కింద పెట్టేస్తాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమాన పరిచినట్లు అవుతుంది. ఈ కారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదట.