Movies

వెంకటేష్ తల్లి గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

మూవీ మొఘల్ గా పేరొందిన స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తెలుగులోనే కాదు దాదాపు అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు తీశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎందరో దర్శకులను, నటీ నటులను,సాంకేతిక నిపుణలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అద్వితీయం అని చెప్పవచ్చు. ‘బ్రతుకు – బ్రతికించు’అనే సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు దాన్ని ఆచరించి చూపిన మహనీయుడు రామానాయుడు.పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు కదా. అలాగే రామానాయుడు విజయం వెనుక ఆయన సతీమణి రాజేశ్వరి పాత్ర ఎంతో ఉంది. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కుమారులతో పాటు లక్ష్మి అనే కూతురు జన్మించారు.

గ్రామంలో చేస్తున్న వ్యవసాయం వదిలేసి, సినీ రంగానికి వెళ్లాలని నిర్ణయించుకున్న రామానాయుడుని అందరూ నిరుత్సాహ పరిచారు. అయితే రాజేశ్వరి మాత్రం వెన్నుదన్నుగా నిల్చి ప్రోత్సహించింది. రామానాయుడు ఒంగోలులోని తన బంధువు బిబిఎల్ సూర్యనారాయణ ఇంట్లో వుంటూ ఎస్ ఎస్ ఎల్ సి చదివే సమయంలో అక్కడే ఉన్న తనమేనమామ ఇంటికి తరచూ వెళ్ళేవాడు.

ఆ సమయంలో రాజేశ్వరిని చూసి మనసు పారేసుకున్న రామానాయుడు అప్పటికే ఓ హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేసేవారు. ఇక రాజేశ్వరిని తప్ప మరొకర్ని పెళ్లి చేసుకోనని రామానాయుడు తండ్రికి చెప్పడంతో కొడుకు మాట కాదనలేక ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపించారు. ఆరోజుల్లో వందల ఎకరాల్లో సేద్యం ఉండేది వారికి. భర్తతో పాటు పొలానికి వెళ్లి, కూలిపనులు పర్యవేక్షించడమే కాదు,తాను కూడా కాయకష్టం చేసేది.

ఇక రూపాయి విలువ బాగా తెల్సిన వ్యక్తి కావడంతో వచ్చిన ఆదాయంలో బానే పొదుపు చేసేది రాజేశ్వరి. అయితే ఇలా పొదుపు చేసిన విషయం రామానాయుడికి తెలీదట. ఇక చిత్ర రంగానికి వెళ్ళడానికి వీలుగా ఒక్కసారిగా లక్షల్లో డబ్బు ఇచ్చేసరికి రామానాయుడు షాక్ తిన్నాడు. చిన్నప్పటి నుంచి దాచిన సొమ్మని ఆమె చెప్పడంతో ఆయన కళ్ళు చెమర్చాయట.

మరి రాజేశ్వరి హస్తవాసి ఎలాంటిదంటే, ఆమె చేతి డబ్బు తీసుకుని సినీ రంగానికి వెళ్లిన రామానాయుడికి పట్టిందల్లా బంగారం అయింది. ఆయన తీసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. కొడుకులు కూడా ప్రయోజకులయ్యారు. ఇక వెంకటేష్ కూడా స్టార్ హీరోగా ఎంతోపేరు తెచ్చుకున్నాడు. సురేష్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నాడు.

కుటుంబాన్ని చక్కదిద్దిన రాజేశ్వరి ఇక ఇటీవలే తన మనవడు నాగచైతన్య పెళ్ళిలో కూడా ఎంతో హుషారుగా కనిపించింది. పెళ్ళికొడుకు తరపున రాజేశ్వరి తెచ్చిన చీరనే సమంత ధరించింది.