Movies

మంగళవారం ఈ పనులు చేస్తే ఇక అంతే సంగతులు…. ఆ పనులు ఏమిటో తెలుసా?

మనకి ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది. ఒకరోజు మనం అనుకున్న పని అయిపోతుంది. ఇంకో రోజు అవ్వదు. అందుకే ఏరోజు ఏనిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయో దానిప్రకారం మనం ప్రయత్నాలు చేస్తే,అనుకున్న పనులు పూర్తవుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. మంగళుడు అంటే కుజ గ్రహం. కుజుని ఆధిపత్య వహించే రోజుని మంగళవారం అంటారు. కుజుని స్థితి జాతకంలో బాగోలేక పొతే, మంగళవారం గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. అందుకే మనపెద్దలు మంగళవారం సభలు,సమావేశాలకు దూరంగా ఉండేలా, ఆరోజు ఎలాంటి శుభ కార్యాలు, మీటింగ్స్ వద్దని చెప్పేవారని విశ్లేషకుల అంచనా. ఆరోజు అందరిలో ఆవేశం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున చర్చలకు ఆస్కారం లేకుండా మంగళవారం కొన్ని పనులను చేయరాదని పెద్దలు నిషేధం విధించి ఉండవచ్చని అంటారు.

శుభకార్యాలు, ప్రయాణాలు, కొనుగోళ్లు ఇలాంటి వాటికి మంగళవారం అంత శుభకరం కాదని చెబుతారు. కుజుని ప్రభావం రక్తం మీద అధికంగా ఉంటుంది కాబట్టి,ఆవేశం పాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుచేత అధికారులను,పెద్దలను కలవడానికి మంగళవారం వద్దని చెబుతారు.
ఇక శారీరక శ్రమ చేయడానికి , స్పోర్ట్స్ , గేమ్స్ లో పాల్గొనడానికి మంగళవారం చాలా శుభకరం అని చెప్పవచ్చు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకోడానికి కూడా మంగళవారం మంచిదని అంటారు. ఇక శస్త్ర చికిత్సలు చేసుకోడానికి కూడా ఈరోజు అద్భుతం గా పనిచేస్తుంది. నీటి నిజాయితీలతో వ్యవహరించేవారికి మంగళవారం విజయాలు చేకూరతాయి.

ఇక ఇంట్లో పాడైపోయిన వస్తువులు, ఫ్రిజ్ లు,కూలర్లు,వాషింగ్ మిషన్ లాంటివి రిపేర్ చేయించుకోడానికి మంగళవారం చాలా మంచిందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. రీసెర్చి లాంటి పనులు కూడా మంగళవారం చేయవచ్చు. ఇక ఏ వ్యక్తయినా తప్పుచేస్తే నిలదీయడానికి, గట్టిగా అడగడానికి కూడా మంగళవారం మంచిదే. అయితే మనవైపు తప్పు ఉండకూడదు. అప్పుడే మనకి కల్సి వస్తుంది.

అంతేకాదు భూ వ్యవహారాలకు కూడా మంగళవారం శుభకరం. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా తగు నిర్ణయం తీసుకోడానికి మంచిది. అయితే అగ్రిమెంట్ లాంటివి మాత్రం మంగళవారం చేయకూడదు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోడానికి మంగళవారం మంచిరోజు. ఇక మంగళవారం అప్పు తీరిస్తే,భవిష్యత్తులో అప్పులు చేసే స్థితి రాకుండా ఉంటుందని, అందుచేత అప్పులు ఏవైనా తీర్చాల్సి ఉంటే, మంగళవారం తీర్చాలని జ్యోతిష్య శాస్రం చెబుతోంది.

మంగళవారం సుందరకాండ పారాయణ చేసినా, మహాభారతం చదివినా చాలా మంచింది. కుజ గ్రహ దోషాలతో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా దీనివలన పోతాయని చెప్పవచ్చు. కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం, ఆంజనేయ స్వామిని పూజించడం చేస్తే,మంగళవారం మనకున్న అవరోధాలు తొలగిపోతాయి.