Movies

ఉపాసన పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఎంత గొప్ప పని చేసాడో చూడండి

ఉపాసన … ఒకప్పుడు ఈ పేరు అపోలో హాస్పిటల్ వరకే పరిమితం .. కానీ మెగా ఇంటి కోడలు అయ్యాక యావత్ మెగా అభిమానులకు సుపరిచితం. నిజానికి రామ్ చరణ్ వైఫ్ మాత్రమే కాదు, అనేక సంస్థలను కార్య కౌశలంతో అగ్ర స్థానంలో నిలుపుతూ, నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సామాజిక స్పృహ గల యువతి. అవును, అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా, అపోలో హాస్పిటల్ ఎండీగా దూసుకుపుతున్న ఉపాసన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కోడలు కాకముందే,అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేది. ఓ విధంగా ఉపాసనలోని సామాజిక స్పృహ అనే గుణం రామ్ చరణ్ ని విశేషంగా ఆకర్షించింది. నిజానికి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది కూడా ఓ సామాజిక కార్యక్రమం సందర్భంలోనే కావడం విశేషం.

ఆ పరిచయం ప్రేమగా మారడానికి సమయం పట్టిందేమో గానీ, అది పెళ్లి పీటలు ఎక్కడానికి మాత్రం ఎంతో సమయం పట్టలేదు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నాక, ఒక్కటవ్వాలంటే పెళ్లి తప్పనిసరి మార్గమని గ్రహించి,ఇరు పక్షాల పెద్దలను ఒప్పించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
ఇక పెళ్లి అయిననాటి నుంచి రామ్ చరణ్, ఉపాసన ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా నడుచుకుంటున్నారు.

ఇక జూలై 20 ఉపాసన పుట్టినరోజు సందర్బంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా గడిపింది. ఇందులో భాగంగా చెర్రీతో కల్సి ఓ వీధి బాలల పునరావాస కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ బాలబాలికలకు కానుకలు అందించడంతో పాటు వారితో కల్సి ఒకపూట ఉల్లాసంగా గడిపింది.అక్కడి పిల్లలకు తన ఫౌండేషన్ ద్వారా ఉచితంగా హెల్త్ చెకప్ చేయించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మెడిసిన్స్ సరఫరా చేసిందట.

స్టార్ హోటల్ నుంచి అంత్యంత నాణ్యత గల భోజనం రప్పించి పెట్టడంతో పాటు ,పండ్లు ఇతర తినుబండారాలు అందించి వారి ముఖాల్లో కొత్త వెలుగులు నింపింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యువత ఆధ్వర్యాన మెగా అభిమానులు తన పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి వాళ్లలో ఉత్సాహం నింపింది. అంతేకాదు అక్కడ ఉపాసన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.