Devotional

రాఖీ పండుగ రోజు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు… ఒకవేళ చేస్తే కష్టాలు ఎదురు అవుతాయా చూడండి

రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. రాఖీ పౌర్ణమి అనేది అక్కాచెల్లెళ్లు,అన్నదమ్ములు కలిసి చేసుకొనే పండుగ. రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంత కాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. అయితే ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమకు సూచనగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ యొక్క ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

ఇది అన్నా చెల్లెల్లు,అక్కా తమ్ముళ్ళు జరుపుకునే అందమైన ఆత్మీయమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ కట్టేదే రాఖీ. ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. రాఖీ పొర్ణమిని రక్ష బంధన్ అని కూడా అంటారు.రాఖీ పౌర్ణమి రోజు అన్నదమ్ములు అక్కచెల్లెలను తిట్టకూడదు.

వారిని ఏడిపించకూడదు ఎందుకంటే రాఖీకి చాలా పవిత్రత ఉంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టటం వలన ఇద్దరికీ అనుకున్న పనులు నెరవేరతాయి. అంతేకాక సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. రాఖీ పండుగ రోజు వారి చేత కంట నీరు తెప్పించిన,పరుషంగా మాట్లాడిన,కోపం చూపించిన వారు అనుకున్న పనులు నెరవేరవు.

రాఖీ కట్టే సోదరి,కటించుకొనే సోదరుడు ఒకరి కొకరు మర్యాదలను కాపాడుకోవాలి. సోదరుడు రాఖీ కట్టించుకున్న తర్వాత సోదరికి చీర లేదా ఏదైనా బహుమతి ఇవ్వాలి. సోదరి,సోదరులు కలిసి ఆనందంగా భోజనం చేయాలి. ఇలా చేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. కానీ ఇలా చేయకుండా ఉంటే మాత్రం కష్టాలు తప్పవు.