Devotional

కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి… ఒకవేళ చేస్తే సకల పాపాలు చుట్టుకుంటాయి… ఆ పనులు ఏమిటో తెలుసుకోండి

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమిని భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. విష్ణు మూర్తి ఎనిమిదొవ అవతారంలో శ్రీకృష్ణుడు జన్మించారు. ఈ రోజు భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణుడుకి పూజ చేసి ఆయనకు ఇష్టమైన పాలు,మీగడ,వెన్న,అటుకులు,బెల్లం నైవేద్యం పెట్టి ఉపవాసం ఉంటారు. శ్రీకృష్ణుని అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలి. అలాగే కొన్ని పనులను చేయకూడదు.

కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలోను కోయకూడదు. విష్ణువుకు తులసి మొక్క చాలా ప్రియమైనది. తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది . కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడానికి మాత్రం కోయవచ్చు.

శ్రీకృష్ణుడుకి ధనిక,పేద వారు అనే బేధం లేదు. అందరిని సమానంగా చూసేవారు. శ్రీకృష్ణుడు మిత్రుడు అయినా సుదాముడు చాలా పేదవాడు. అయినా శ్రీకృష్ణుడుకి సుదాముడు చాలా ప్రియమైనవాడు. పేదవారిని అగౌరపరిస్తే శ్రీకృష్ణుడుకి అసంతృప్తి కలుగుతుంది. అంతేకాక శనిదేవుడికి ఆగ్రహం కూడా కలుగుతుందట. అందువల్ల పేదవారిని దానాలు చేస్తే మంచిది.

కృష్ణాష్టమి రోజు చెట్లను నరకటం చాలా దురదృష్టం అని భావిస్తారు. ఆ రోజు మొక్కలను నాటితే ఆ ఇల్లు సంపదలతో తులతూగుతారు. అంతేకాక ఆ రోజు ఎవరికీ హాని తలపెట్టకూడదు. అంతేకాక అటువంటి ఆలోచనలు కూడా చేయకూడదు. హిందూమతం ప్రకారం, భక్తులు మాంసాహార ఆహారాన్ని తీసుకోరాదు. అంతేకాక కృష్ణాష్టమి రోజున మద్యం సేవించకూడదు.

కృష్ణుడు చిన్నతనం నుండి ఆవులంటే చాలా ఇష్టం. చిన్న తనం నుండి గోవులతో అడ్డుకోవటంతో ఆయనకు ఎంత ప్రియమైనవో తెలుస్తుంది. ఆవులను పూజించే వారికి శ్రీకృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఆవులను అగౌరపరిస్తే శ్రీకృష్ణుడు అనుగ్రహం కలగదు. ఒక గోశాలకు విరాళము ఇవ్వడం, లేదా ఒక గాయపడిన ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిది.