Movies

టాలీవుడ్ ని ఏలుతున్న పంజాబీ ముద్దుగుమ్మల మీద ఒక లుక్ వేద్దామా

మన తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కన్నా పర బాషా హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు. లయ,సుహాసిని వంటి తెలుగు అమ్మాయిలు సినీ పరిశ్రమకు వచ్చిన ఎక్కువ రోజులు లేరు. ఒకప్పుడు చెన్నై భామలు,కేరళ కుట్టీలు హీరోయిన్స్ గా హవా చాటితే ఇప్పుడు పంజాభి ముద్దుగుమ్మలు తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. వారి గురించి వివరంగా తెలుసుకుందాం.

మెహరీన్ పిర్జాదా
క్రిష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ పిర్జాదా ఆ తర్వాత మహానుభావుడు,రాజా ది గ్రేట్ సినిమాలు చేసి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని సొంతం చేసుకుంది. ఈ భామ పంజాబ్ లోని భటిండా ప్రాంతానికి చెందిన సిక్ ఫ్యామిలికి చెందిన అమ్మాయి.

సిమ్రాన్
1997 లో అబ్బాయిగారి పెళ్లి సినిమాలో సుమన్ సరసన నటించిన సిమ్రాన్ పంజాబి ఫ్యామిలికి చెందినదే.కానీ ముంబాయిలో పుట్టి పెరిగింది.తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగింది.పెళ్లయ్యాక సినిమాలకు దూరమయినా క్రిష్ణ భగవాన్ తో జంటగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.సినిమాలు చేయకపోయినా ఇప్పటికీ సిమ్రాన్ కి మన తెలుగు వాళ్లు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు.

తాప్సీ పన్ను
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి మంచు వారి ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి.పంజాబీ కుటుంబానికి చెందిన తాప్సీ డిల్లీలో పుట్టి అక్కడే చదువుకుంది.తెలుగులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత బాలివుడ్ వైపు వెళ్లిన ఈ భామ ,మళ్లీ ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమాతో హిట్ కొట్టింది.

రకుల్ ప్రీత్ సింగ్
ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో రకుల్ ఒకరు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి ముందు కెరటం అనే సినిమాలో నటించింది రకుల్ ,కానీ అంతగా పేరు రాలేదు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత తిరిగి చూసుకోలేదు.వరుసగా అల్లు అర్జున్,చరన్,రవితేజ,మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోస్ అందరి సరసన ఛాన్స్ కొట్టేసిన రకుల్ ది పంజాబే.

కాజల్ అగర్వాల్
అప్పుడెప్పుడో లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి కెరీర్ ప్రారంభించిన కాజల్ పదేళ్లయినా స్టార్ హీరోయిన్ ప్లేస్ ని భద్రంగా కాపాడుకుంటుంది.తనతోపాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది హీరోయిన్స్ ఎప్పుడో లైమ్ లైట్ లోకి వెళ్లిపోయారు.కాజల్ చెల్లి నిషా కూడా సినిమాల్లో నటించినప్పటికీ అక్కంత పేరు తెచ్చుకోలేదు,పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.కాజల్ మాత్రం ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ తో దూసుకుపోతుంది.ముంబయిలో సెటిల్ అయిన పంజాబీ కుటుంబానికి చెందింది కాజల్.

ఛార్మీ కౌర్
నీతోడు కావాలి సినిమా ద్వారా పదమూడేళ్లకే ఇండస్ట్రీకి పరిచయమయిన ఛార్మీ పంజాబ్ ,సిక్ కుటుంబీకురాలు.ఇప్పుడు అటు హీరోయిన్ గా ఇటు పూరి జగన్నాద్ కి సంభందించిన నిర్మాణ సంభంద సంస్ద బాద్యతలు చూస్తుంది.

భూమిక చావ్లా
యువకుడు సినిమా ద్వారా పరిచయం అయిన భూమిక ,పవన్ కళ్యాన్ సరసన నటించిన ఖుషీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకంది.తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది.ఈమె కూడా పంజాబ్ కుటుంబానికి చెందినదే కానీ బాల్యం ,విధ్యాభ్యాసం అంతా ఢిల్లీలో సాగింది.

నవనీత్ కౌర్
ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా నవనీత్ కౌర్ మొదటి సినిమా .ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన నవనీత్ కూడా పంజాబీ భామే

పూనమ్ బజ్వా
మొదటి సినిమాతో పరిచయమయిన పూనమ్ బజ్వా ది కూడా పంజాబే.ముంబాయిలో పెరిగిన పూనమ్ బజ్వా తెలుగులొ కొన్ని సినిమాలు చేసింది..ఇప్పుడు నటనకు దూరంగా ఉంది

నికితా
హాయ్ సినిమా ద్వారా పరిచయమయిన నికితా ది కూడా పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయే.