సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు శుభవార్తలు వింటారు…అన్ని అనుకూలమే
మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అయితే కొంత మంది జాతకాలను అసలు పట్టించుకోరు. జాతకాలను నమ్మే వారు మాత్రం వారి రాశిని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. 12 రాశుల్లో ఈ రోజు వృషభ రాశి సెప్టెంబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికీ ప్రతికూలతలు,అనుకూలతలు తెలుసుకుందాం. ఈ రాశి వారు ఉద్యోగం కోసం తీవ్రమైన ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. వీరికి కష్టపడితేనే ప్రయోజనం కలుగుతుంది. ఇంటిలో శుభ కార్యాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వీరు భూమి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. అంతేకాక కొంత గౌరవ మర్యాదలకు లోటు కలగటంతో కాస్త మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ లో ఉన్న పనులను అన్ని ఈ నెలలో పరిష్కారం అవుతాయి.
వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారానికి అవసరమైన రుణాలు కూడా సకాలంలో అంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విహార యాత్రలకు వెళతారు. దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములు అనుకూలంగా ఉంటారు. ఇంటి డెకరేషన్ కోసం కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తారు. నెల చివరలో ఆశాంతి నెలకొంటుంది.
కాబట్టి కాస్త జాగ్రత్తలు వహించాలి. పేదవారికి కడుపు నిండుగా భోజనం పెట్టటం మరియు పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే కాస్త అశాంతి తగ్గుతుంది. శనివారం శ్రీ రామ రక్షా స్త్రోత్రం పఠించాలి.