Movies

అలనాటి స్టార్ విలన్ నాగభూషణం మనవడు టాలీవుడ్ హీరో అన్న విషయం మీకు తెలుసా?

సినీ నేపధ్యం వున్నా లేకున్నా సత్తా ఉంటే,మంచి నటీనటులుగా ఇండస్ట్రీలో నిలదొక్కోవచ్చు. కొందరు సినీ నేపథ్యంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తే, మరికొందరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వస్తారు. ఇక విషయంలోకి వెళ్తే, ‘అర్ధం చేసుకోరూ’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సయ్యద్ హమీద్ భూషణ్ తొలిసినిమాతోనే మంచి నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఇతడికి తమిళ, హిందీ భాషల్లో ఆఫర్స్ వచ్చేసాయి. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏక్ పోలీస్, ఆతర్వాత మ్యాప్,పదహారేళ్ళ వయస్సు వంటి మూవీస్ లో నటించినప్పటికీ అనుకున్నంత ఇమేజ్ రాలేదు. ఇక తమిళంలో తెల్లాయి సందప్ సినిమాలో హీరోగా వేసాడు. అదే సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్ తన్నుకుంటూ వచ్చింది. అయితే హిందీ మూవీ రిధం లో మెయిన్ విలన్ గా అవకాశం దక్కించుకున్నాడు.

ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ లో హిందీలో వీరలెవెల్లో గుర్తింపు వచ్చేసింది. తెలుగులో మాత్రం స్టార్ హీరో గా నిలబడలేక పోయిన హమీద్ భూషణ్, ఇంతకీ ఎవరంటే, తెలుగు చిత్రసీమలో విలనిజానికి అసలు సిసలు నిర్వచనం ఇచ్చిన స్టార్ విలన్ ఎవరని అడిగితే, ఠక్కున గుర్తొచ్చే రక్తకన్నీరు నాగభూషణం మనవడు.

నాగ భూషణం ఆరోజుల్లో విలనిజాన్ని పెట్టింది పేరు. విలన్ అంటే ఇలా ఉంటాడా అని ఈయన పేరు చెప్పగానే తెలిసిపోతుంది. ఎన్టీఆర్, అక్కినేనిలకు సమ ఉజ్జీగా అన్నిరకాల విలనిజంతో పోటీ ఇచ్చాడు. హీరో హీరోయిన్స్ తర్వాత కీలక భూమిక విలన్ దే. అందుకే ఆరోజుల్లో నాగభూషణం కాల్ షీట్స్ దొరకడం కష్టం అయ్యేది.

హీరోయిన్ అయినా మార్చుకోవచ్చేమో గానీ విలన్ ని మార్చుకోలేం కదా అని ఆరోజుల్లో దర్శక నిర్మాతలు ఈయన కోసం ఎదురుచూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటారు. అయితే నాగభూషణం నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హమీద్ భూషణ్ కి రావాల్సిన గుర్తింపు రాలేదు. నాగభూషణంకి హమీద్ కి ఉన్న పేర్లు బట్టి వీళ్ళ బంధం గురించి అనుమానం రావచ్చు.

అయితే సినిమా ఆటోగ్రాఫర్ , దర్శకుడు మీర్ కొడుకే సయ్యద్ హమీద్. నాగభూషణం కూతురు భువనను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీర్ ఆవిధంగా నాగభూషణానికి అల్లుడయ్యాడు. నిజానికి వీళ్ళ పెళ్లి అప్పట్లో సెన్షేషన్ సృష్టించిందని అంటారు. టివి సీరియల్స్ లో డైరెక్టర్ అయిన మీర్ పరిచయం చేసిన వాళ్ళే సినిమాల్లో ప్రస్తుతం సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా,యాంకర్స్ గా బిజీ బిజీ గా ఉన్నారు. అయితే తండ్రి, తాతల నుంచి వారసత్వం తో వచ్చిన హమీద్ గుర్తింపు కోసం అతడు కృషి సాగిస్తూనే వున్నాడు.