Devotional

రేపు వినాయకచవితి రోజు ఈ ఒక్క పని చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి

మనం ఏ పని చేయాలన్నా మొదటగా విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి పూజిస్తాం. ఆలా పూజిస్తే చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం. రేపు వినాయకచవితి పండుగ. ఈ పండుగను దేశమంతా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. భద్రపదమాసంలో చవితి రోజు ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం వినాయచవితి పండుగ సెప్టెంబర్ 13 అంటే రేపు వచ్చింది. వినాయకచవితి రోజు పూజ చేసుకుంటే సంవత్సరం అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉంటారని నమ్మకం. వినయకచవితి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఈశాన్యం మూల ముగ్గు వేసి దాని మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించిన పీటను వేయాలి. పాలవెల్లిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రకరకాల పండ్లను పాలవెల్లికి కట్టాలి. పూజ చేసుకొనే వారు తూర్పు ముఖంగా

కూర్చొని పసుపుతో వినాయకుణ్ణి చేసుకొని తమలపాకు మీద పెట్టి దీపారాధన చేయాలి. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించాలి. వినాయకుని మీద అక్షింతలు వేసి నమస్కరం చేయాలి. వినాయకునికి లఘు పూజ చేసిన తర్వాత అరటిపండ్లు,బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత గణపతిని ఆవాహన చేయాలి. వినాయకుణ్ణి ఆవాహన చేయటానికి వినాయకునికి కుంకుమ బొట్టు పెట్టి ఈ శ్లోకాన్ని పఠించాలి.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమో నమః
ప్రాణ ప్రతిష్ఠాపన ముహర్తహ సుముహూర్తస్తూ

అని మంత్రం చదువుకొని వినాయకుణ్ణి తాకి పువ్వులు,అక్షింతలు వేసి మహా గణపతికి ఆసనం ఏర్పాటు చేసి వినాయకునికి ప్రాణ ప్రతిష్ట చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కలస పూజ చేయాలి. కలశానికి ఆకుపచ్చ వస్త్రాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే వినాయకునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కలశంలో నీటిని పూజ ద్రవ్యాలపై మరియు వినాయకుడి మీద జల్లాలి. ఇలా నీళ్లు జల్లుతూ ఈ మంత్రాన్ని పఠించాలి

ఓం అపవిత్రా పవిత్రోవా సర్వా వస్తాం గతో పి వ
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య భ్యంతర శుచి హి

ఆ తర్వాత విగ్నేశ్వర అష్టోత్తర శతనామావళి ని పఠిస్తూ పత్రి పూజ చేయాలి. ఆ తర్వాత వినాయకుణ్ణి గంధం,అక్షింతలు,పువ్వులతో పూజించాలి. వినాయక పూజలో తెల్ల జిల్లేడు పువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వినాయకునికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే మంచిది. రెండు దీపం కుందులను తీసుకొని దానిలో వత్తులు వేసి స్వచ్ఛమైన కొబ్బరినూనె పోసి వెలిగించాలి. ఆ తర్వాత ఇంటిలో చదువుకొనే పిల్లలు ఉంటే వారి పుస్తకాలను,వ్యాపారానికి సంబందించిన పుస్తకాలను పసుపుతో ఓం అని రాసి బొట్లు పెట్టి వినాయకుని దగ్గర పెట్టాలి.

ఆ తర్వాత మహానైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంలో వినాయకునికి ఇష్టమైన కుడుములు,బెల్లం,అటుకులు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత వినాయకునికి తాంబూలం సమర్పించి వినాయక వ్రత కల్పం చదువుకోవాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. వ్రత కల్పం కథ చదివినప్పుడు చేతిలో అక్షింతలను ఉంచుకోవాలి. ఆ అక్షింతలను కొన్ని వినాయకుడి మీద వేసి మిగతావి మన శిరస్సు మీద జల్లుకోవాలి. ఇలా అక్షింతలను జల్లుకోవటం వలన వినాయకుని కటాక్షం లభిస్తుంది. వినాయకచవితి రోజు తప్పనిసరిగా మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలి.

ఇంటిలో పూజ చేసిన వినాయకుణ్ణి నిమజ్జనం చేసే వరకు ఉదయం,సాయంత్రం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకోవాలి. వినాయకచవితి రోజు వినాయక ఆలయాన్ని దర్శిస్తే మంచిది. ఈ విధంగా భక్తి శ్రద్దలతో పూజ చేసుకుంటే విఘ్నాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి