Movies

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ స్థాయికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో? నమ్మలేని నిజాలు

కష్టాలు,కడగండ్లూ జీవితంలో సహజం. కానీ కొందరి కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మరికొందరి కష్టాలు తెలిస్తే హడలెత్తిపోతాం. ఇదేకోవలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వస్తాడు. సాయం చేస్తానన్న ఫ్రెండ్ లోకం విడిచిపోగా, కీలక సమయంలో తండ్రిని కోల్పోయాడు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కు సీరియస్ అయితే ఓ నటుడు సమయానికి అడ్డుకోవడంతో ఆమె బతికి బయట పడింది. అయితే ఇన్ని కష్టాలు అధిగమించిన జానీ మాస్టారు ఇప్పుడు సినిమాల్లో బిజీ. అగ్ర హీరోలు సైతం ఇతని పాట ఉండాలని కోరుకునేంతగా పాపులర్ అయ్యాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే,నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టారు అసలు పేరు షేక్ జానీ బాషా.

1982జులై 2న షేక్ ఉమెన్ బాషా,బీబీ జాన్ దంపతులకు జన్మించారు. తండ్రికి ఆరోజుల్లో మూడు లారీలు ఉండేవి. అయితే జానీకి చదువు అబ్బకపోవడంతో బాటు అల్లరి పిల్లాడిగా పేరుపొందాడు. దీనికి తోడు అక్క పెళ్లి కోసం ఎక్కువ డబ్బు ఖర్చవ్వడం,ఒకదాని వెనుక మరో లారీ ప్రమాదాలకు గురికావడంతో కుటుంబం కష్టాల్లో పడింది. దీంతో నారంగ్ బాజాలో ఫ్రెండ్స్ తో కల్సి డాన్స్ లు వేసే పని ఒప్పుకున్న జానీకి క్రికెట్ పిచ్చి కూడా ఉండడంతో చదువు మొత్తం చంక నాకి పోయింది.

ఇక తండ్రి లారీ మెకానిక్ పనికి కుదిర్చాడు. ఆతర్వాత ప్రొక్లైన్ ఆపరేటర్ గా పనిచేసాడు. అప్పటికే 16ఏళ్ళు వచ్చేయడంతో ఇంట్లో తిట్లు భరించలేక నెల్లూరు మేనత్త ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పెన్నా నదిలో చేపలు వేటాడుతూ కాలం నెట్టుకొచ్చాడు. విపరీతంగా సినిమాలు చూసేవాడు. ఓ రోజు తల్లి అక్కడికి వచ్చి ఇదేం పని అంటూ తిట్టడంతో చేయికోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మొత్తానికి తేరుకున్నాక చిట్టిబాబు అనే వ్యక్తి ట్రూపులో చేరి ముఖబుల పాటకు డాన్స్ చేయడంతో అందరూ మెచ్చుకున్నారు.

ఆ తర్వాత డాన్స్ షో చూసిన జానీ , చిట్టిబాబు గ్రూప్ లో చేరితే, సినీ ఛాన్స్ వస్తుందని భావించాడు. హైదరాబాద్ డాన్స్ యూనియన్ లో ఐడి కార్డు ఇప్పించమని అడిగాడు. ఈలోగా ఎవరికీ చెప్పకుండా డాన్స్ షో కోసం ముంబయి వెళ్లిపోవడంతో చిట్టిబాబుతో జానీకి బంధం తెగింది. అయితే చిట్టిబాబు దగ్గర ఉన్నప్పుడే పరిచయం అయిన నరసింహారెడ్డి అనే వ్యక్తి ఆహ్వానం మేరకు హైదరాబాద్ వెళ్లిన జానీకి అశోక్ రాజా మాస్టర్ ని పరిచయం చేసాడు. దీంతో ఛాన్స్ లు ఇప్పించిన అశోక రాజా మాస్టారు ఎక్కడైనా 3వేలు వస్తే,,ఓ వెయ్యి తీసుకుని రెండువేలు ఇచ్చేవాడట. దీన్ని ప్రశ్నించడంతో జానీని తన ట్రూప్ నుంచి అశోక్ బయటకు పంపేశాడు.

ఆ సమయంలోనే పరిచయమై ప్రాణ స్నేహితుడిలా ఆదుకున్న సిరాజ్ అనే వ్యక్తి సౌదీ వెళ్లి డబ్బు సంపాదించి పంపుతానని, దాంతో సినిమాల్లో డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పాడట. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో సిరాజ్ మరణించడంతో జానీ మాస్టారు కుంగిపోయారు. అతని పేరుని కొడుక్కి పెట్టుకున్నాడు ఇక నేరుగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని ప్రతిరోజూ పవన్ కళ్యాణ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడట. ఇదేమిటి రోజూ నన్నే చూస్తున్నావని పవన్ అడగడంతో తన దగ్గర ఓ కథ ఉందని, అది మీకు సరిపోతుందన్నాడట. అయితే దాన్ని ఇంకాస్త డవలప్ చేయమని, ఎక్కువగా పుస్తకాలు చదవమని, ఇంగ్లీషు నేర్చుకోమని సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పాడట.

ఇక ఓ రోజు అనుకోకుండా రామ్ చరణ్ డిల్లకు డిల్లా పాటకు జానీ మాస్టారు కొరియాగ్రాఫర్ గా ఛాన్స్ రావడం అది కాస్తా హిట్ కొట్టడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పటిదాకా 100సినిమాలకు డాన్స్ మాస్టర్ గా చేసాడు. ఇక అత్తారింటికి దారేది మూవీలో కెవ్వు కేక,కాటమరాయుడా పాటలకు డాన్స్ కంపోజ్ చేసి,తన ఇమేజ్ మరింత పెంచుకున్నాడు.

ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జయహో మూవీలో మూడు పాటలకు కంపోజ్ చేసాడు. కాగా ఓరోజు రవీంద్ర భారతిలో ఓ డాన్స్ ప్రోగ్రామ్ చూడ్డానికి వెళ్లిన జానీ మాస్టర్ అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. విచిత్రమో ఏమో గానీ అదే అమ్మాయి డాన్స్ యూనియన్ లో మెంబర్స్ షిప్ కోసం వస్తే, పరిచయం చేసుకుని తన గ్రూప్ లో చేర్చుకున్నాడు. ఇద్దరీ మధ్యా ప్రేమ చిగురించి,పెళ్ళికి దారితీసింది.

ఇద్దరూ మతాలూ వేరు అవ్వటంతో రామ్ చరణ్ ఆ పెళ్ళికి అండగా నిలిచాడట. భర్త కోసం అయేషాగా పేరు మార్చుకున్న ఆమె డెలివరీ సమయంలో సీరియస్ కండీషన్ కి వెళ్లడంతో ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. ఏమిచేయాలో తోచక,రామ్ చరణ్ కి ఫోన్ చేస్తే,వెంటనే అపోలో హాస్పిటల్ కి చేర్పించాడట. మొత్తానికి తల్లీ బిడ్డ క్షేమం అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు జానీ మాస్టారు.

అయితే చివరిలో బిల్లు ఎంత పడుతుందోనని కంగారుపడుతుంటే,కేవలం 350రూపాయల బిల్లు వచ్చిందట. అది కూడా బిడ్డకు పాల డబ్బా బిల్లు. బిడ్డకు పాల డబ్బా తండ్రి కష్టార్జితంతో ఉండాలని రామ్ చరణ్ అనడంతో అదే బిల్లు వేసి ఇచ్చారట. విషయం తెలుసుకుని,రామ్ చరణ్ కి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తే,ప్రాణాల మీదికి వచ్చేవరకూ ఎందుకు చెప్పలేదని చెప్పేసి పంపించేసాడట.