Movies

రోజా హీరోయిన్ మధుబాల గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఏమి చేస్తుందో తెలుసా?

అప్పట్లో దేశభక్తిని మేళవించి తీసిన రోజా సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో ఎన్నో వింతలూ,విశేషాలూ ఉన్నాయి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీతోనే ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి,పాటల్లో తన సత్తా చాటాడు. అరవింద్ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఈమూవీతోనే దక్షిణాది స్క్రీన్ పై మధుబాల జిగేల్ మనిపించింది. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావడంతో అందాల భామ మధుబాలకు అనూహ్యంగా క్రేజ్ వచ్చింది. నిజానికి రోజా కన్నా ముందే వానమై ఎల్లే మూవీ విడుదలై సంచలనం విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో రోజాలో మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడు.

అయితే రోజాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన మధుబాల కు వరుస సినిమాల్లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. రోజా సక్సెస్ తర్వాత హీరో డాక్టర్ రాజశేఖర్ సరసన మ్యూజికల్ హిట్ అల్లరి ప్రియుడు మూవీలో రమ్యకృష్ణ , మధుబాల కల్సి నటించారు. ఇక ఆతర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జెంటిల్ మెన్ మూవీ మధుబాలను టాప్ రేంజ్ కి తీసుకెళ్లింది. తెలుగులో పుట్టినిల్లా మెట్టినిల్లా,చిలకోట్టుడు,గణేష్ చిత్రాలతో అప్పుడప్పుడూ తళుక్కుమని మెరిసిన ఈ అందాల భామ బాలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

హిందీ డ్రీమ్ గాళ్ హేమమాలిని కి స్వయానా మేనకోడలు అయిన మధుబాల, జూహ్లీ చావ్లా కు వదిన అవుతుంది. అయితే మధుబాల పూర్తిపేరు మధుబాల రఘునాధన్. ఈమెది తమిళ కుటుంబం అయినప్పటికీ ముంబయిలో స్థిరపడ్డారు. అందుకే హిందీ, ఇంగ్లీషు,మలయాళ భాషల్లో అనర్గళంగా మాట్లాడ గల నేర్పు వచ్చింది. బాలీవుడ్ లో ఆమె నటించిన ఫూల్ ఔర్ కాంటే మూవీ ఇప్పటికే ఎవర్ గ్రీన్ హిట్ చిత్రంగా చెప్పుకుంటారు.

ఇక హిందీలో హీరోయిన్స్ రోల్స్ అదరగొట్టినప్పటికీ, దక్షిణాది భాషా చిత్రాల కారణంగానే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మధుబాల 1999లో ఆనంద్ చావ్లా ను పెళ్ళాడి సెటిల్ అయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు. 2008లో రీ ఎంట్రీ ఇచ్చి, టీవీ, సినిమాల్లో బిజీగా మారిపోయింది. కుటుంబంతో హాయిగా జీవనం సాగిస్తూ , రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణిస్తోంది.