Movies

త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నప్పుడే తండ్రులను కోల్పోయిన పవన్,ఎన్టీఆర్

యాదృచ్ఛికమో ఏమో గానీ ఇద్దరు అగ్ర హీరోలకు ఒకే రకమైన కష్టం వచ్చింది. అది కూడా ఒకే దర్శకుడు చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కావడం. ఆ ఇద్దరికీ తండ్రులు దూరమయ్యారు. అయితే సరిగ్గా తాము చేస్తున్న సినిమాల్లో తండ్రి చితికి నిప్పంటించే సీన్లు నటించాక ఇలా జరగడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం. వివరాల్లోకి వెళ్తే,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ . ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. జల్సా మూవీ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తండ్రి మరణం సంభవించింది. అయితే ఆ సినిమాలో తండ్రి చితికి నిప్పంటించే సీన్ కూడా ఉందట.
Trivikram,Pawan Kalyan
ఇక తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన పవన్ కి త్రివిక్రమ్ అండగా నిలబడి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మూవీ షూటింగ్ కూడా బాగానే ముగిసింది. ఆ చిత్రం మంచి హిట్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తొలిసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద్ సమేత మూవీ చేస్తున్నారు.

ఈ సినిమాలో తండ్రి చితికి నిప్పు పెట్టె సీన్ వుంది. నిజానికి తారక్ ఇప్పటివరకూ 27 సినిమాలు చేసినా, ఎక్కడా ఇలాంటి సీన్ లేదు. 28వ సినిమాలో అలాంటి సీన్ వుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పీక్ కి చేరుకున్న సమయంలోనే తారక్ తండ్రి హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు.ఇక తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు.

కొన్ని రోజుల విరామం తర్వాత షూటింగ్ కి హాజరైన తారక్ ఎక్కడా బాధ పడకుండా సున్నితంగా డీల్ చేస్తూ షూటింగ్ ముగించారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ మధ్య బంధం కూడా మరింత బలపడింది. మొత్తం మీద ఒకే దర్శకుడి సినిమాల సమయంలో ఇలా ఇద్దరు హీరోల తండ్రులు మరణించడాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో రకరకాలుగా ఆడిపోసుకుంటున్నారు.