Movies

అరవింద సమేత ఎందుకు చూడాలి 5 కారణాలు ఇవే?

సున్నితత్వం,మెలోడీ,కామెడీ,పంచ్ డైలాగులు, కసి,పగ,ప్రతీకారం,ఎమోషనల్ టచ్,ఇలా విభిన్న కోణాల సమాహారంగా ‘అరవింద సమేత … వీర రాఘవ’ మూవీ ఉండబోతోందని అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కలయికలో తీసిన ఈ మూవీ ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు,నాగబాబు,నవీన చంద్ర వంటి వాళ్ళు ఉండనే వున్నారు. ముఖ్యంగా పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా జగపతి బాబు కీలక పాత్ర పోషించాడని అంటున్నారు. కత్తుల్లేవా, కఠారులు లేవా అనే మాటలూ ఉన్నాయి,అదేసమయంలో యుద్ధం ఆపేవాడే మొనగాడు వంటి హత్తుకునే పవర్ ఫుల్ డైలాగులూ ఉన్నాయి. సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ కనిపించడం కూడా ఓ ఎఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు.

అనగనగా వంటి పాట లో క్యూట్ గా కనిపించే పూజా తో ఎన్టీఆర్ జోడీ కడుతూ స్టెప్స్ కూడా అదరగొడుతూ కనిపిస్తుంటే,మరోపక్క పెనిమిటి సాంగ్ మరోకోణాన్ని చూపిస్తోంది. అనగనగా సాంగ్ సున్నితంగా మెలోడీ జోడించి వున్నా సరే, స్టెప్స్ కూడా భిన్నంగా కంపోజ్ చేసినట్లు చెబుతున్నారు. ఆది,సాంబ తర్వాత ఎన్టీఆర్ పూర్తి తరహా ఫ్యాక్షన్ నేపధ్యం గల సినిమాగా అరవింద సమేత అవుతుందని,అయితే పైకి అరవింద పేరు పెట్టినా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గల వీర రాఘవ పేరు కూడా సినిమా టైటిల్లో జోడించడం కూడా ఓ లాజిక్కుగా చెబుతున్నారు.

నీలాంబరి క్యారెక్టర్ లో సునీల్ కూడా రావడం, ఎన్టీఆర్ కి సునీల్ కి మధ్య మంచి సన్నీవేశాలు ఉండడం కూడా అదనపు ఆకర్షణ అవుతుందని చెబుతున్న్నారు. వినే మాట చెప్పే మనిషిని బట్టి విలువ మారిపోతుందని ఈ సినిమాలో చెప్పే డైలాగల్లాంటి ఎన్నో పదునైన మాటలు సినిమాకు బాగా బలంగా ఉంటాయని అంటున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన విషాదం తర్వాత కొద్దీ రోజులకే తండ్రి హరికృష్ణ ఇకలేడన్న బాధను దిగమింగుకుని పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ నటించిన సినిమా కూడా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయి.

ఫ్యాక్షన్ తో సినిమా తీయడంతో పాటు అసలు ఫ్యాక్షన్ వలన నష్టపోయిన కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఇలా అందరి జీవితాలను టచ్ చేస్తూ ఓ మంచి సందేశాన్ని కూడా అరవింద సమేత అందిస్తుందని అంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కీలక రోల్ పోషించాడని, నిజానికి అతని చుట్టూనే ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. రామాయణ, మహాభారత గాధల్లోని డైలుగులు కూడా ఈ సినిమాలో పేలతాయని అంటున్నారు.