Movies

ఎన్టీఆర్, శోభన్ బాబులకు సాధ్యం కానిది కృష్ణ ఎలా సాధించాడు… ఒక్కసారి లుక్ వేయండి

డేరింగ్ అండ్ డేషింగ్ అనే మాటలకు తెలుగు ఇండస్ట్రీలో కేరాఫ్ అడ్రెస్ ఎవరంటే అందరూ చెప్పేమాట సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు కలర్,స్కోప్, స్టీరియో ఫోనిక్ 70ఎం ఎం సౌండ్ ఇలా ఎన్నో సాంకేతిక విలువలు అద్దిన ఈ బుర్రిపాలెం బుల్లోడు అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కృష్ణ సినిమాల్లో ప్రవేశించడమే కాదు, ఎన్టీఆర్ తో కల్సి నటిస్తూ తానె సినిమా తీసిన ఘనుడు. దేవుడు చేసిన మనుషులు చిత్రం అప్పట్లో సంచలనం. నిజానికి ఈ మల్టీ స్టారర్ సినిమా ఇద్దరు సీఎం లను ,ఐదుగురు ఎంపిలను అందించింది. ఎన్టీఆర్, జయలలిత ఇద్దరూ సీఎం లు అయ్యారు. జగ్గయ్య,కైకాల సత్యనారాయణ,కృష్ణ, రావుగోపాలరావు,జమున ఎంపీలు అయ్యారు. ఇలా ఓ రికార్డు ఈ సినిమాకు వుంది.

ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త నటులతో సినిమా తీయాలని భావించి ఆడిషన్స్ నిర్వహిస్తే, సెలెక్ట్ అయిన కృష్ణ,ఆవిధంగా తేనెమనసులు మూవీతో కృష్ణ గా వెండితెరపై మెరిశాడు. కౌబాయ్, జేమ్స్ బ్యాండ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. మోసగాళ్లకు మోసగాడు మూవీ అప్పట్లో ట్రాక్ రికార్డ్. ఇక పెళ్లయి,పిల్లలున్నప్పటికీ రెండో పెళ్లి చేసుకోవడం కూడా కృష్ణ సాహసాన్ని బయటపెట్టింది.

భర్తకు దూరమై, ఉన్న ఒక్క కొడుకుని పెంచడం కష్టంగా మారిపోయి,అందరిచేతా మాటలు పడుతున్న విజయనిర్మలను రెండోపెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఎన్ని అనుకున్నా అనుకున్నది సాధించాడు. ఇక సొంత ఫామిలీ లోని పిల్లలను తీర్చిదిద్దారు. ఆవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహేష్ బాబుని తండ్రిని మించిన తనయునిగా నటనలో రాణించేలా చేసాడు.

ఇక వయస్సు 75 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఆపిల్ పండులా నిగనిగలాడిపోయే కృష్ణ టాలీవుడ్ కి పరిచయం అయి 50ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికీ హుషారుగా కనిపిస్తాడు. ఇక 300లకు పైనే చిత్రాల్లో నటించిన కృష్ణ ఆరోజుల్లో రెండు చేతులా సంపాదించేవారు. స్టూడియో అధినేతగా, ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా,దర్శకునిగా ఇలా అన్నిరంగాల్లో రాణించిన కృష్ణ ఆరోజుల్లోనే 500కోట్లు కూడబెట్టారని అనుకునేవారు. సింహాసనం సినిమాతో ఇటు టాలీవుడ్,అటు బాలీవుడ్ లలో ఒకేసారి భారీ సెట్టింగ్స్ సినిమా తీసి సక్సెస్ కొట్టిన హీరో కృష్ణ.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ మరపురాని మూవీగా చెప్పుకునే చారిత్రక సినిమా అల్లూరి సీతారామరాజు సినిమాను కృష్ణ తీసి అందరిమన్ననలు అందుకున్నారు. నిజానికి ఈ సినిమా తీయాలని నటరత్న ఎన్టీఆర్ భావించారు. చర్చలు కూడా జరిగాయి. మరోపక్క ఈ సినిమా చేయాలని అందాల నటుడు శోభన్ బాబు కూడా పోటీ పడ్డారట. అయితే అప్పట్లో ఔట్ డోర్ లో ఎక్కువ పార్ట్ తీయడం ద్వారా కేవలం 3నెలల్లోనే కృష్ణ ఈ సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్, శోభన్ బాబుల నుంచి అభినందనలు కూడా అందుకున్నారు.