వెంకటేష్ కార్లు ,ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూస్తే కళ్ళు జిగేల్ మంటాయి. కొందరు సింపుల్ గా ఉంటారు. మరికొందరు తమ హుందాకు తగ్గట్టు ఖర్చు చేస్తారు. ఇక ఆస్త్లులు కూడబెట్టడంలోనూ, విలువైన కార్లు కొనడంలోనూ మరికొందరు దిట్ట. అందులో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గురించి చెప్పుకోవాలి. స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొగల్ డాక్టర్ దగ్గుబాటి రామనాయడు కుమారుడైన వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో తెరంగేట్రం చేసి,హీరోగా తన సత్తా చాటాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలద్వారా తానేమిటో నిరూపించుకున్నాడు. విదేశాల్లో ఎంబీఏ చేసిన వెంకటేష్ ఆర్ధిక క్రమశిక్షణ,లావాదేవీలు తండ్రి నుంచి అలవరచ్చుకున్నాడు. ఒక్కొక్క సినిమా కు 3. 5కోట్ల నుంచి 4. 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. వివిధ సంస్థల్లో 120కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
మాటల మనిషి అనకుండా చేతలమనిషి అంటే వెంకీకి కరెక్ట్ గా సరిపోతుందని అంటారు. రియల్ ఎస్టేట్ సహా,అన్ని లాభదాయక రంగాల్లో పెట్టుబడులు పెట్టి బానే కూడబెట్టాడు. సినీ ఇండస్ట్రీలో సుమారు 30ఏళ్లుగా గల వెంకీ ఇప్పటివరకూ 70కి పైగా సినిమాల్లో చేసారు. 7నంది బహుమతులు,5ఫిలిం ఫెర్ అవార్డులు సాధించారు. ఈయనకు అన్నయ్య సురేష్ బాబు,సోదరి లక్ష్మి అనే ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు.
చెన్నైలోని డాన్ బాస్క్ స్కూల్ లో చదువుకున్న వెంకీ లయోలా కాలేజీలో బ్యాచిలర్స్, యు ఎస్ యూనివర్సిటీలో ఎం బి ఏ పూర్తిచేశారు. బిజినెస్ లో బాగానే సక్సెస్ అయిన వెంకటేష్ ఆస్తులు,నెట్ వర్త్,గురించి రకరాకాల వార్తలు కధనాలు వస్తున్నాయి. వాటిల్లోని ముఖ్య అంశాలు తీసుకుంటే,వెంకీ ఆస్తుల్లో ఈ ఏడాది 27శాతం గ్రోత్ కనిపించిందని అంటున్నారు.
31మిలియన్ డాలర్ల నెట్ వర్త్ ఉన్నట్లు వెల్లడైంది. అంటే 217కోట్లు ఉంటుందన్న మాట. వెంకీకి ఆరు లగ్జరీ కార్లున్నాయి. వీటివిలువ సుమారు పదికోట్ల వరకూ ఉంటుందట. ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి వెంకటేష్ కి బెంజ్, బిఎం డబ్ల్యూ ,జాగ్ వేర్,మెసిడిటీ కార్లున్నాయి. ఇక జూబ్లీ హిల్స్ లో ఒకప్పుడు ఉన్న వెంకీ, మణికొండలో ఇండివిడ్యువల్ హౌస్ లో నివసిస్తున్నారు. దీని విలువ ప్రస్తుతం 30కోట్ల వరకూ ఉంటుంది. ఇక రమణ మహర్షి బోధనలు అంటే ఎంతోమక్కువ గల వెంకటేష్ ఆయన్ని ఫాలో అవుతారు.