Movies

అమితాబ్ జీవితంలో ఎవరికి తెలియని కొన్ని నమ్మలేని నిజాలు

తిట్టిన నోరే పొగుడుతుందన్న సామెత ఉండనే ఉంది. ఎవరైతే పనికిరావని పొమ్మన్నారో,ఏ లక్షణాలు అందుకు కారణంగా నిలిచాయో వాటినే తన ఉన్నతికి అనుగుణంగా మలుచుకున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు. అందులో హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. 76ఏళ్ళ ప్రాయంలో కూడా మంచి పాత్రలు ఎన్నుకుని నటిస్తూ, మెప్పిస్తున్న అమితాబ్, గౌరవ ప్రదమైన,హుందాతో కూడిన పాత్రలతోనే రాణిస్తున్నారు. గతంలో మనం మూవీలో నటించిన అమితాబ్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న సైరా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా కొణిదల బ్యానర్ పై రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చిరంజీవికి గురువు పాత్రలో అమితాబ్ నటిస్తున్నట్లు తేలింది. ఎందుకంటే అమితాబ్, చిరంజీవి హోమం చేస్తున్న పిక్ ఇప్పటికే లీకయింది.

ఇక అమితాబ్ 76వ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన మోషన్ టీజర్ లో సైరా గురువైన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటిస్తున్నట్లు వెల్లడైంది. నిజానికి ఈ సినిమాలో అమితాబ్ నటించడం వలన బాలీవుడ్ లో కూడా క్రేజ్ వచ్చింది. అయితే అమితాబ్ తొలిరోజుల్లోకి వెళ్తే, సినిమా ఛాన్స్ లకోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సన్నగా రివటలా వున్నాడు, సరైన బాడీలేదు,చెట్టంత ఎత్తుమాత్రం వున్నావులే అని తెగ హేళన చేసేవారట.

ఇక అమితాబ్ గొంతు విని,ఈ వాయిస్ ముక్కుతో మాట్లాడుతున్నట్లు వుంది,నీకు వాయిస్ మైనస్ అంటూ ముఖం మీదే చెప్పేసి,అవమానిస్తూ, తిప్పి పంపేసేవారట. అయితే అమితాబ్ లో చెప్పిన మైనస్ లనే ప్లస్ లుగా మారిపోయి,స్టార్ డమ్ ని తెచ్చిపెట్టాయి. ఎవర్ గ్రీన్ యాంగ్రీ యంగ్ మెన్ గా నిలబెట్టాయి.

యాక్షన్ మూవీస్ తో దూసుకుపోయాడు. షోలే లాంటి సినిమాలు అమితాబ్ ని సూపర్ స్టార్ చేసాయి. సినీ పరిశ్రమను ఏకచత్రాధిపత్యంగా ఏలాడు. అయితే వయస్సు మీరడంతో వెకిలి పాత్రల జోలికి వెళ్లకుండా హుందాతనం కాపాడుతుకుంటూ నటజీవితంలో తన ప్రస్థానం సాగిస్తున్న అమితాబ్ ఆలిండియా నెంబర్ వన్ ,సూపర్ స్టార్ హీరోగా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడని చెప్పవచ్చు. దటీజ్ అమితాబ్.