Movies

సురేష్ భార్య టాప్ ప్రొడ్యూసర్… ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

సినిమా ప్రపంచంలో ఒక్కోసారి పరిస్థితులు కలిసిరావు. ఇంకోసారి వెతుక్కుంటూ వస్తాయి. అయితే కొందరు ఎక్కడ ఛాన్స్ లు ఉంటె అక్కడకి షిఫ్ట్ అవుతూ,ఆయా పాత్రలు పోషిస్తూ ఉనికిని చాటుకుంటారు. ఇక ఒకప్పుడు హీరోగా పరిచయమై,తర్వాత నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పించి,ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో హీరోలకు ధీటుగా నటిస్తూ , ఇంకోపక్క టివి సీరియల్స్ లో కూడా రాణిస్తున్న నటుడు సురేష్ గురించి వివరాల్లోకి వెళ్తే,1963 ఆగస్టు 26న శ్రీకాళహస్తిలో గోపినాధ్,రాధాదేవి దంపతులకు జన్మించాడు. ఇతని తాతగారు ఒకప్పుడు సినిమాలకు పాటలు,పద్యాలు రాసారు. ఆతర్వాత ఉపాధ్యాయ పోస్టు రావడంతో అందులో సెటిల్ అయ్యారు.

నటుడు సురేష్ 1981లో పన్నీరు పుష్పాంగల్ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే అదే సంవత్సరం రామదండు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిచిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో తమిళ,తెలుగు సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు వచ్చాయి. హీరోగా పలు చిత్రాల్లో మెప్పించిన సురేష్ విలన్ కేరక్టర్స్ లో కూడా నటించి, తన క్రేజ్ పెంచుకున్నాడు.

ఇక 2002లో రాఘవ అనే మూవీతో ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. కొన్ని చిత్రాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేసి సక్సెస్ అయ్యాడు. ఇక అనిత అనే మహిళను పెళ్లి చేసుకున్న సురేష్ కి ఆ మేరేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. సురేష్ ఎక్కువగా సినిమాల్లో బిజీ గా ఉండడం,ఇంట్లో ఎక్కువ సమయం గడపకు పోవడం నచ్చక పోవడం వంటి పరిణామాల్లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

అయితే ఆతర్వాత ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోవడం విశేషం. లక్ష్మి రెండో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోగా, రాజశ్రీ అనే మహిళను సురేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రచయిత – నిర్మాత అయిన రాజశ్రీ, సురేష్ నటించే సీరియల్స్ కి రైటర్ గా బాధ్యత తీసుకుంటారు. 2014లో వచ్చిన మైనేమ్ ఈజ్ మంగతాయారు మూవీకి కథ,మాటలు,నిర్మాణ బాధ్యత కూడా ఈమె తీసుకున్నారు. ఇక అనేక చానల్స్ లో వచ్చే సీరియల్స్ ని నిర్మించేది రాజశ్రీ అని చెప్పాలి.