Politics

రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్న యామిని సాధినేని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటారు. కానీ ప్రోత్సహించేవాళ్ళు బహు అరుదుగా ఉంటారు. అందునా రాజకీయ రంగం అంటే ముందే అడ్డుపుల్ల వేస్తారు. అలాంటి రాజకీయ రంగంలో ఇప్పుడు ఓ మహిళ దూసుకెళ్తోంది. ఆమె పేరు యామిని సాధినేని. గుంటూరుకు చెందిన ఈమె తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎపి నైపుణ్యాభివృద్ధి కమిటీ మెంబర్ గా కొందరికే తెల్సిన ఈమె పేరు ఇప్పుడు ఏపీలో మారుమోగిపోతోంది. ఈమెకు భర్త ఇద్దరు పిల్లలున్నారు. ఓ వైపు కుటుంబం,మరో వైపు వ్యాపార రంగం,ఇంకోవైపు రాజకీయ రంగం లో రాణిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోనే చదువుకున్న యామిని సాధినేని ఐటి బేస్డ్ ఎంబీఏ కోర్సు పూర్తిచేసింది.

ఆ తర్వాత వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆసక్తి కలగడంతో అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ కోర్సులు చేసింది.ముఖ్యంగా తుపాన్ లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందరూ ఆధార పడే కీలక వ్యవస్థ హ్యామ్ రేడియో ఆపరేటర్ గా పేరుగాంచిన ఈమె,హుదూద్ తుపాన్,చెన్నై వరదలు,ఇలా తుపాన్,బంగ్లాదేశ్ వరదల సమయంలో హ్యామ్ రేడియోతో సేవలందించింది.

సెల్ ఫోన్స్,టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయని ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంకా చెప్పాలంటే అత్యవసర సమయంలో వినియోగించే హ్యామ్ రేడియోలు నేరుగా శాటిలైట్ కి కనెక్ట్ అయివుంటాయి. వరల్డ్ వైడ్ గా హ్యామ్ రేడియో ఆపరేటర్లు కొందరే ఉంటారు. అందులో యామిని సాధినేని తుపాన్ ల సమయంలో అందించిన సేవలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

ఎపి నైపుణ్యాభివృద్ధి కమిటీ మెంబర్ గా 27రంగాలలో శ్రమిస్తున్న ఈమె తెలంగాణా,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ,అందిస్తున్న సేవలను ఐక్య రాజ్య సమితి గుర్తించి, పీస్ కనెక్ట్ పిన్ అనే ప్రతిష్ఠాత్మక అవార్డుని కూడా అందుకుంది. ఈ అవార్డుతో స్పెషల్ స్క్రాప్ ని ప్రధానం చేసారు. ఇలా స్క్రాప్ అందుకున్న తొలి భారతీయ మహిళ కావడం విశేషం. ఇది ధరించిన వాళ్ళు దేశవ్యాప్తంగా 17సూత్రాలను అమలు చేయాలి.

ఇక ఓ ఫార్మా కంపెనీ నెలకొల్పి అనతికాలంలోనే కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఇక టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి చేపట్టిన కొద్దిరోజులకే ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శిస్తూ అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా తుపాన్ కి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో నేటికీ కరెంట్ రాలేదంటూ జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నేపథ్యంలో ఆధారాలతో సహా రిప్లై ఇచ్చి యామిని సాధినేని తన స్టామినా ఎలాంటిదో చూపించింది. పవన్,జగన్ లకు ఇలా కౌంటర్ ఇస్తూ, టిడిపిలో అతికొద్ది సమయంలోనే మంచి గుర్తింపు పొందిన ఈమె భవిష్యత్తులో ఎలాంటి పదవులు పొందనుందో చూడాలి.