Movies

మురారి సినిమాలో నటించిన ఈ నటుణ్ని గుర్తు పట్టారా…. సంపాదించిన ఆస్తిని ఏం చేసాడో తెలుసా ?

సినిమాల్లో ఒక్కక్కరిదీ ఒక్కో స్టైల్ అని చెప్పాలి. కొందరు కామెడీ పండిస్తే, మరొకరు ప్రత్యేకమైన వాచకం, గంభీరమైన గొంతు,ఇలా ఎవరి లెవెల్లో వారు పేరుతెచ్చుకుంటారు. అలా వాచకంలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధూళిపాళ సీతారామ శాస్త్రి లోని నట గొప్పతనాన్ని గుర్తించి నటరత్న ఎన్టీఆర్ తాను తీసిన శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని పాత్ర ఇచ్చారు. నిజానికి ఈ పాత్రకు అంతకు ముందు సి ఎస్ ఆర్, లింగమూర్తి వాళ్ళు వన్నె తెస్తే,ప్రత్యేక తరహా వాచకంతో, హావభావాలతో మరింత వన్నె తెచ్చారు. బతుకుతెరువు కోసం కొంతకాలం ప్లిడర్ గుమస్తాగా చేసిన ధూళిపాళ కు చిన్నప్పటినుంచి నాటకరంగం అంటే వల్లమాలిన ప్రేమ. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటక రంగ ప్రవేశం చేసారు.

ధూళిపాళ 1941లో గుంటూరులో స్టార్ థియేటర్ నెలకొల్పి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. తంగస్థలం మీద దుర్యోధన,కీచక పాత్రలకు మంచి పేరు వచ్చింది. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లిన ధూళిపాళ నటనా కౌశలం పోటీలకు జడ్జిల్లో ఒకరైన జి వరలక్ష్మి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లోకి రావాలని సూచిస్తూ, ఆనాటి డైరెక్టర్ బి ఏ సుబ్బారావుకి పరిచయం కూడా చేసారు. ఆవిధంగా భీష్మ మూవీలో దుర్యోధన పాత్ర లభించింది.

ఆ సినిమాలో భీష్మునిగా నటించిన ఎన్టీఆర్, ధూళిపాళ నటనకు మెచ్చి,శ్రీకృష్ణ పాండవీయం మూవీలో శకుని పాత్ర ఇచ్చారు. నిజానికి ఆ పాత్రతో అయన కెరీర్ మారిపోయింది. రావణుడు,మైరావణుడు,గయుడు,వంటి ఎన్నో పౌరాణిక పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు.ఇక సాంఘిక చిత్రాల్లో కూడా ధూళిపాళ దుష్ట పాత్రలతో పాటు సాత్విక పాత్రలలో సైతం మెప్పించారు. శ్రీ ఆంజనేయం,మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు. సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవనం వైపు అదుగులు వేశారు.

పుట్టినవాడు గిట్టక మానడన్న సూక్తిని జీర్ణించుకున్న ఈయన సన్యాసం స్వీకరించారు. తన ఆస్తి పాస్తులను త్యజించి, గుంటూరు మారుతినగర్ లో మారుతి దేవాలయం నిర్మించి రామాయణం,సుందరాకాండలను తెలుగులో రాసారు.

2007 ఏప్రియల్ 13న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1922సెప్టెంబర్ 24న జన్మించిన ధూళిపాళ నాటకాల్లో, సినిమాల్లో అసామాన్య నటనతో అందరినీ కట్టిపడేసి,జీవిత చరమాంకంలో శ్రీరాముని సేవలో గడిపిన ధన్య జీవి ఆయన.