Kitchen

దసరా స్పెషల్ – జంతికలు

కావలసిన పదార్ధాలు

బియ్యపిండి – 5 కప్పులు
శెనగపిండి – ఒకటిన్నర కప్పు
వాము 2 స్పూన్స్
ఉప్పు – రుచికిసరిపడ
ఎర్రకారం – కొంచం
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 7
అల్లం – 2 అంగుళాల ముక్క
నెయ్యి – 4 స్పూన్స్
నూనె – డీప్ ఫ్రై

తయారీ విధానం

మిక్సీ జార్ లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. అందులో కొంచం(పావుకప్పు) నీళ్ళు వేసి వడకట్టుకుని ఉంచుకోవాలి. ఒక పెద్ద పళ్ళెంలో బియ్యపిండిని, శెనగపిండిని జల్లించుకుని, అవి రెండు కలిసేలా కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడ ఉప్పు, కొంచం కారం, వాము, నెయ్యి, వడకట్టిన అల్లం పచ్చిమిర్చి నీళ్ళు వేసి ఒకసారి అన్ని కలిసేలా కలపాలి.

అందులో కొంచం కొంచం నీళ్ళు వేస్తూ గట్టి ముద్దలా కలుపుకోవాలి. జంతికల గిద్దలో స్టార్ ఉన్న బిళ్ళ వేసి దానికి లోపల నూనె రాసి కొంచం కలిపిన పిండిని పెట్టి కాగే నూనెలోకి చక్రంలా వత్తి కాలాక తీసి సర్వ్ చేయండి.ఎయిర్ టైట్ డబ్బలో పెడితే వారం వరకు నిలవ ఉంటాయి.