Movies

హీరో అర్జున్ భార్య టాప్ హీరోయిన్…ఆమె తండ్రి కూడా టాప్ హీరోనే… ఎవరో తెలుసా?

స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు అయిన హీరో అర్జున్ తెలుగు , తమిళ , కన్నడ భాషల్లో కూడా టాప్ హీరోగా పేరుతెచ్చకున్నాడు. అర్జున్ తెలుగులో మా పల్లెలో గోపాలుడు మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ మూవీలో పల్లెట్టూరి యువకునిగా నటించిన అరుణ్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాడు. సినిమా మంచి హిట్ కూడా కొట్టింది. యాక్షన్ మూవీస్ అర్జున్ ని వెతుక్కుంటూ వచ్చాయి. ఆ విధంగా టెర్రర్,కోటిగాడు,మన్నెంలో మొనగాడు,కౌబాయ్ నెంబర్ 1వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇక అర్జున్ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే, అర్జున్ కి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కన్నడ చిత్రాలలో నటించే సమయంలో సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె నివేదిత ను చూసి మనసు పారేసుకున్నాడు. అప్పటికే రధసప్తమి అనే మూవీలో ఆమె నటించింది. పెళ్లంటూ చేసుకోవాలంటే ఈమెనే చేసుకోవాలని అర్జున్ ఫిక్స్ అయ్యాడు. 1986లో వచ్చిన రద సప్తమి సినిమా పెద్ద హిట్ అయింది. ఆమె నటించిన తొలిచిత్రం హిట్ అవ్వడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. అయితే అర్జున్ కారణంగా నివేదితకు అదే చివరి చిత్రం అయింది.

అర్జున్ అవస్థ చూసి, నివేదిత ఒకే చెప్పేయడంతో ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. ఆతర్వాత బెంగుళూరు నుంచి చెన్నై మకాం మార్చింది. అయితే అర్జున్ సలహాతో శ్రీరామ్ ప్రొడక్షన్ పేరుతొ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. ఇటీవల సోల్లె వెడవ చిత్రాన్ని తమిళంలో తీశారు. అర్జున్ డైరక్షన్ చేయగా, చందనకుమార్ నటించిన ఈమూవీలో అర్జున్ కుమార్తె హీరోయిన్ వేషం కట్టింది.

భార్యాభర్తలు ఇద్దరూ నటులైనప్పటికీ ఒకరు నటిస్తే సరిపోతుందని,కాపురం సరిగ్గా నిలవాలంటే ఇది అవసరమని నివేదిత స్పష్టం చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే,1993లో వచ్చిన జెంటిల్ మెన్ చిత్రం అర్జున్ కెరీర్ ని టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లి,సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అప్పటిదాకా సాదాసీదాగా ఉన్నా, ఈ మూవీతో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఆతర్వాత ఒకేఒక్కడు,హనుమాన్ జంక్షన్,పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలతో కెరీర్ మరింత పెరిగింది.