జీవిత చెల్లెలు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా …. ఇప్పుడు ఆమె ఏమి చేస్తుందో తెలుసా ?
తలంబ్రాలు సినిమా చేస్తున్న సమయంలో జీవిత చెల్లెలు ఉమ కూడా సరదాగా అక్కతో పాటు షూటింగ్ కి వచ్చేది. ఆ సమయంలో తలంబ్రాలు సినిమాలో కల్యాణ చక్రవర్తి చెల్లులు పాత్ర కోసం చాలా మందిని చూసిన ఎవరు నచ్చలేదు శ్యాం ప్రసాద్ కి . రోజు షూటింగ్ లో సందడి చేస్తున్న ఉమను చూసేసరికి ఆ పాత్రకు సరిపోతుందని సెలక్ట్ చేసి ఆ విషయం జీవిత కు చెప్పితే దానికి సరిగ్గా మాట్లాడటం కూడా రాదు అదేమీ చేస్తుంది వద్దని అన్నారట. కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి బాగా నచ్చటంతో ఉమను ఒకే చేసేసారట. షూటింగ్ మొదటి రోజే ఉమ చిత్ర యూనిట్ కి చుక్కలు చూపించిందంట. నిల్చోమన్న చోట నిల్చొనేది కాదట. అసలు చెప్పిన మాట అసలు వినేది కాదట. దాంతో షూటింగ్ ని మూడు రోజులు బ్రేక్ ఇచ్చి మరి అన్ని నేర్పించారు ఉమకు. అయినా పాత పద్దతిని మార్చుకోలేదు ఉమ. దాంతో విసిగిపోయిన చిత్ర యూనిట్ ఉమ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్ చేసేసారట. అందుకే సినిమాలో ఎక్కువగా క్లోజ్ అప్ షాట్స్ ఏమి కనపడవు.
సినిమా విడుదల అయ్యాక సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో ఉమకు మంచి పేరు వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడగటం మొదలు పెట్టారు. దాంతో ఇంటిలో కూడా జీవితను నీ కన్నా నీ చెల్లె అందంగా ఉందని అనటంతో చెల్లిని సినిమా ఆఫీసుల చుట్టూ తిప్పటంతో మూడు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఉమ ఇక సినిమాలు అనవసరం అనుకోని పెద్ద బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితంలో సెటిల్ అయ్యిపోయింది.