Movies

డైరెక్టర్ రాఘవేంద్రరావు తల్లి టాప్ హీరోయిన్ అయినా తల్లిని పట్టించుకోక పోవడానికి కారణం ఇదే

ఎవరైనా జీవితంలో తల్లి గురించి ప్రస్తావించని వారుండరు. అంతగా అమ్మతో అనుబంధం పెనవేసుకుంటుంది. కానీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాత్రం ఎప్పుడూ కూడా తల్లి ప్రస్తావన తీసుకురారు. తండ్రి కె ఎస్ ప్రకాశరావు గురించి చెబుతారు తప్ప తల్లి ఊసెత్తరు. ఇక ఆ తల్లి కూడా రాఘవేంద్రరావు ని తన కొడుకు అని ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. దీనివెనుక బాలయమైన కారణం ఉంది. నిజానికి రాఘవేంద్రరావు తల్లి గొప్ప నటి. ఆరోజుల్లో స్టార్ హీరోయిన్. అవునండి. ఆమె పేరు జి వరలక్ష్మి. పూర్తిపేరు గరికపాటి వరలక్ష్మి. ఒంగోలులో పుట్టి,గుంటూరులో పెరిగిన ఈమె తండ్రి చిన్నప్పుడే సన్యాసుల్లో కలిసిపోయారు.

ఇక కుటుంబ పోషణ కోసం నాటకాలను ఆశ్రయించారు వరలక్ష్మి. విజయవాడలోని ప్రజానాట్యమండలిలో నాటకాలు వేసేవారు. అదేసమయంలో కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్నుకి చెందిన రాఘవేంద్రరావు తండ్రి కె ఎస్ ప్రకాశరావు తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా చిగురించి, పెళ్లిపీటలు ఎక్కింది. విజయవాడలో కొన్నాళ్ళు కాపురం చేసాక మద్రాసుకు మకాం మార్చారు.

వీళ్లకు ఇద్దరు పిల్లలు. వింధ్య రాణి సినిమాలో రమణారెడ్డి పక్కన వరలక్ష్మి చిన్న వేషం వేశారు. ఇక భర్త ప్రకాశరావు తో కల్సి ఎల్వి ప్రసాద్ నిర్మించిన ద్రోహి సినిమాలో నటించారు. ప్రకాష్ పిక్చర్స్ బ్యానర్ పేరిట ఇద్దరూ ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రకాష్ స్టూడియో పేరిట స్టూడియో కట్టారు. ఎన్టీఆర్ తో పెళ్లిచేసి చూడు మూవీలో నటించారు. అలాగే ఆనాటి టాప్ హీరోల సరసన హీరోయిన్ గా వేశారు.జి వరలక్ష్మి తెలుగులో ఎంతటి పేరు తెచ్చుకున్నారో తమిళంలో కూడా అంత పేరుండేది.

ఇక మధ్య వయస్సులో కేరక్టర్ ఆర్టిస్టుగా మారి, గయ్యాళి భార్య,అత్తగారి పాత్రల్లో కూడా నటించిన జి వరలక్ష్మి,వృద్ధాప్యంలో తల్లి పాత్రల్లో జీవించారు. మొదటి నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువ కావడంతో ఎలాంటి వారినైనా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు దులిపేసేవారు. కోపం వస్తే చెప్పుతో కొట్టేసిన సందర్భాలున్నాయి. ఆరోజుల్లో ఎంతో విలాసంగా బతికిన ఆమె ఓసారి తమిళనాడులో ఎంజీఆర్ తరపున ప్రచారం కూడా చేసారు.
మల్లయుద్ధాలంటే ఆమెకు ఇష్టం. ముఖ్యంగా అజిత్ సింగ్ మల్లయుద్ధాలంటే ఆమెకు పిచ్చి.

అతడిని ఆరాధించిన ఆమె కె ఎస్ ప్రకాశరావు తో విడిపోయి, తనకన్నా చిన్నవాడైన అజిత్ సింగ్ ని పెళ్ళిచేసేసుకున్నారు. సంచలన తార అయినప్పిటికీ భర్తను , ఇద్దరు పిల్లలను వదిలేసి అజిత్ సింగ్ ని పెళ్లిచేసుకుంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇక మీడియాలో ఆరోజుల్లో ఇది కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ అయికూర్చుంది.

అందుకే రాఘవేంద్రరావు తనకు తల్లి ఉందని కానీ,ఆమె ఎవరనే విషయం కానీ ఈనాడు చెప్పలేదు. కె ఎస్ ప్రకాశరావు తోనే ఆయన ఉండేవారు. అయితే అజిత్ సింగ్ తో పెళ్లి మూన్నాళ్ళ ముచ్చట అయింది. అజిత్ సింగ్ తో విడిపోయాక సినీ నిర్మాణం ప్రారంభించిన జి. వరలక్ష్మి ఓ సినిమా కూడా డైరెక్ట్ చేసింది. ఇందుకోసం శ్రీశ్రీ చేత మాటలు,పాటలు రాయించారు.

సినిమా నిర్మాణంలో నష్టపోయి,ఆస్తులు కరిగిపోవడం, కొడుకు కె ఎస్ సూర్య ప్రకాశరావు మరణం ఆమెని కుంగ దీసింది. కొడుకు పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని అనేక కష్ఠాలు పడిన ఆమెకు చివరి రోజుల్లో ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక ఆఖరి రోజుల్లో ఆదరించే వాళ్ళే కరువయ్యారు. ఇక 2006ఆమె మరణించాక రాఘవేంద్రరావు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.