Movies

అలనాటి అందాల తార రాధ తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద హీరో అని తెలుసా?

చంద్రబింబం లాంటి ముఖం, అందం, అభినయం,అన్నింటికి మించి స్టెప్పులతో అదరగొట్టే హీరోయిన్ గా అప్పటి నటి రాధకు మంచి పేరుంది. మెగాస్టార్ చిరంజీవితో సహా అగ్రహీరోలందరి సరసన నటించిన రాధ తెలుగులోనే కాదు తమిళం,కన్నడం,మలయాళ భాషల్లో కూడా నటించి,నెంబర్ వన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. చిరంజీవితో కల్సి ఆయనతో సమానంగా స్టెప్పులేస్తుంటే థియేటర్ లో చప్పట్లు మారుమోగేవి. అందుకే పలు ఇంటర్యూలో కూడా రాధ మాదిరిగా స్టెప్పులతో అదరగొట్టే హీరోయిన్ మరొకరు లేరని చిరంజీవి చెప్పారు కూడా. ఇక ఆమె అక్క అంబిక కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

అంతేకాదు,రాధ సోదరులు కూడా ఇండస్ట్రీలో రాణించారు. ఒక సోదరుడు 80వ దశకంలో,మరో సోదరుడు 90వ దశకంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే రాధ కు అక్క ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఓ తమ్ముడున్నాడని తెలీదు. రాధ, అంబికా కన్నా చిన్నవాడైన తమ్ముడు సురేష్ నాయర్ తన అక్కల వెంట చిన్నప్పుడు షూటింగ్స్ కి వెళ్ళేవాడు.

అక్కల నటన చూసి, బాగా గమనించడంతో అతడికి యాక్టింగ్ పై ఆసక్తి వచ్చేసింది. ఇంటర్ పూర్తయ్యాక బెంగుళూరు యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసాడు. అయితే ఆసమయంలో టీమ్ ఇండియా క్రికెటర్ అనిల్ కుంబ్లే క్లాస్ మేట్ కావడం విశేషం. ఇక స్పోర్ట్స్ కోటాలోనే సురేష్ నాయర్ సీటు దక్కించుకున్నాడు. సురేష్,కుంబ్లే యూనివర్సిటీ టీమ్ తరపున క్రికెట్ పోటీలకు వెళ్లేవారు.

క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉన్నా,తనవాళ్లంతా సినీ రంగంలో ఉండడంతో క్రికెట్ వదిలి సినిమాలవైపు సురేష్ దృష్టి పెట్టాడు. ఆవిధంగా 1998లో తెలుగులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అందరూ కొత్త నటులతో వచ్చిన పరదేశి చిత్రం ద్వారా సురేష్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి రాధ రికమండేషన్ తోనే ఆమూవీలో సురేష్ నాయర్ కి ఛాన్స్ దక్కింది.

చెన్నై స్కూల్ నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ లో డిగ్రీ సంపాదించిన సురేష్ నాయర్, కాలేజ్ డేస్ లోనే ఏడెనిమిది సినిమాల్లో నటించాడు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని ఫిలిం కోర్సులు నేర్చుకున్నాడు. ఫిలిం మేకింగ్ లోకి దిగిన సురేష్ నాయర్ అక్క అంబికా సహకారంతో ఎనిబిల్ యా చిత్రాన్ని తీసాడు.