Politics

వైఎస్ భారతి – నారా బ్రాహ్మణి వీరిద్దరిలో ఎవరు బెస్ట్ చూడండి

రెండు కుటుంబాలకు చెందిన వైఎస్ భారతి – నారా బ్రాహ్మణి ఇంచుమించు సమ ఉజ్జీలే. ఇద్దరూ శక్తిమంతులే. ఇద్దరూ తమతమ పరిధిలో వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్న వారే. అంతేకాదు, ఓ గొప్పింటి కుటుంబం నుంచి మరో గొప్పింటి కుటుంబానికి కోడళ్ళుగా వచ్చిన వారే వీరిద్దరూ. కానీ ఇద్దరి మధ్యా కామన్ పాయింట్లతో పాటు వ్యత్సాసాలూ ఉన్నాయి. ముందుగా నారా బ్రాహ్మణి గురించి ఆలోచిస్తే, విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు మనవరాలు,నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ అయిన బ్రాహ్మణి నిజానికి సినీ నేపథ్యం ఆపై రాజకీయ వాతావరణం గల కుటుంబం నుంచి మరో రాజకీయ కుటుంబానికి కోడలుగా వచ్చింది.

బాలయ్య పెద్ద కూతురిగా పుట్టిన బ్రాహ్మణి అప్పట్లోనే ఎంబీఏ పూర్తిచేసి నందమూరి వారసత్వానికి ప్రతీకగా నిల్చింది. ఇక వైఎస్ భారతి కూడా చదువు విషయంలో దిట్టే. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. బ్రాహ్మణి తల్లిదండ్రులు బాలకృష్ణ,వసుంధర ఇద్దరూ సమాజంలో మంచి పేరున్నవాళ్ళు కాగా, భారతి తల్లి దండ్రులు సమాజంలో మంచి హోదాలు ఉన్నవాళ్లు.

భారతి తండ్రి గంగిరెడ్డి,తల్లి సుగుణా రెడ్డి ఇద్దరూ డాక్టర్లే. వీళ్ళు తమ కుమార్తెకు 1996లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడి వైఎస్ జగన్మోనరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అలాగే బ్రాహ్మణిని 2007 ఆగస్టు 26న ఎపి ప్రస్తుత సీఎం చంద్రబాబు తనయుడు ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ కిచ్చి పెళ్లి చేసారు. భారతి,బ్రాహ్మణి కూడా ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రేమ దోమ అనకుండా తమ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలు చేసుకుని సెటిల్ అయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట కోడలిగా అడుగుపెట్టిన భారతి తక్కువ సమయంలోనే ఆ ఇంట్లో అందరితో కల్సిపోయింది. మంచి కోడలిగా పేరుతెచ్చుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి,ఇంటికి పరిమితం అయింది. ఇక మేనత్తే అత్తకావడంతో అత్తింట బ్రాహ్మణి కూడా మంచి పేరుతెచ్చుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చాక భర్త ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి,హెరిటేజ్ ఫుడ్స్ కి మంచి స్థాయిని కల్పించింది. అయితే ఊహించని విధంగా ఏర్పడ్డ పరిణామాల నడుమ భారతి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

మామ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఓవైపు బాధ పెడితే,మరోపక్క భర్త జగన్ అవినీతి అక్రమాల కేసులో జైలుకి వెళ్లడంతో విధిలేని పరిస్థితుల్లో వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇలా భారతి,బ్రాహ్మణి కూడా కోట్లలో వ్యాపారం ఎంతోగొప్పగా చేస్తూ వస్తున్నారు. గొప్పింటి పుట్టి, ఒళ్ళు వంచి పనిచేసిన దాఖలాలు లేని ఇద్దరూ ఏం చేస్తారులే అని అందరూ అనుకున్నారు. అయితే తమ శక్తియుక్తుల్ని వ్యాపార రంగంలో వినియోగించి అనతికాలంలోనే రాణించారు.

హెరిటేజ్ ఫుడ్స్ కి ఆదరణ మరింత పెంచడానికి బ్రాహ్మణి కృషిచేస్తే,ఎన్నో అవాంతరాలు ఉన్నా సరే,భారతి వ్యాపారరంగంలో తనదైన ముద్ర వేసింది. సాక్షి టీవీ,భారతి సిమెంట్,సాక్షి పేపర్ ఇలా వందల కోట్ల వ్యాపారాలను అలవోకగా నిర్వహిస్తూ వస్తోంది. ఇక భర్తకు ప్రాణం ఇచ్చే ఓ సాధారణ మహిళలుగా ఇద్దరూ పేరుతెచ్చుకున్నారు. మంత్రి లోకేష్ కి చేదోడు వాదోడుగా ఉంటూ బ్రాహ్మణి,అలాగే జగన్ జైల్లో ఉన్నా పాదయాత్రలో ఉన్నా సరే తోడుగా ఉంటూ భారతి మంచి పేరుతెచ్చుకున్నారు.