Movies

ఈ నటిని గుర్తుపట్టారా ? ఆమె తండ్రి ఎవరో …ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుస్తే ఖచితంగా షాక్ అవుతారు?

శుభ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. 1970, 80 దశకాలలో పలు సినిమాలలో కథానాయికగా నటించింది. ఈమె ప్రముఖ సినిమా నటుడు, దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్యకు, ప్రముఖ నటి సూర్యప్రభకు జన్మించింది. ఈమెకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. ఈమె పిన్ని పుష్పవల్లి కూడా ప్రముఖనటి. హిందీ నటి రేఖ పుష్పవల్లి కూతురు.

శుభ తండ్రి వేదాంతం రాఘవయ్యగారు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1953 లో వచ్చిన దేవదాసు సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

శుభ తల్లి సూర్యప్రభ కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. సూర్యప్రభ చెల్లెలు పుష్పవల్లి కూడా హీరోయిన్ గా నటించటమే కాకా శివాజీ గణేశన్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరి కూతురు బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేఖ.

శుభ,రేఖ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. జెమిని గణేశన్ సావిత్రిని పెళ్లి చేసుకోవటంతో శుభకు మహానటి సావిత్రి పిన్ని వరుస అవుతారు. శుభ పిన్ని పుష్పవల్లి జెమిని గణేశన్ నుంచి విడిపోయాక మహానటి సావిత్రిని మూడో పెళ్లి చేసుకున్నాడు.

ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషాచిత్రాలలో నటించింది. ఈమె ప్రత్యగాత్మ, విశ్వనాథ్, లక్ష్మీదీపక్, పి.చంద్రశేఖరరెడ్డి, దాసరి నారాయణరావు, కె.ఎస్.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, బాపు, కోదండరామిరెడ్డి, విజయబాపినీడు, వంశీ, ఐ.వి.శశి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, క్రాంతికుమార్ తదితర దర్శకుల సినిమాలలో పనిచేసింది.