Movies

RRR లో రాజీవ్ కనకాల రోల్ చూస్తే దిమ్మతిరుగుతుంది….కథలో కీలకపాత్ర…?

రాజమౌళి డైరెక్షన్ లో తీస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ లో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ ల రోల్ ఏమిటో అనేది ఇంకా ఎవరికీ తెలీదు. ఇక ఈ సినిమాలో కొత్తగా రాజీవ్ కనకాల ను తీసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రంలో సుబ్బరాజు పోషించిన కుమార్ వర్మ కేరక్టర్ మంచి హైలెట్ అయింది. సుబ్బరాజు కెరీర్ లో గుర్తుండిపోయే ఈ పాత్రను మలిచిన ఘనత రాజమౌళిదే. మొదట్లో భోళా మనిషిగా, అమాయకంగా కనిపించే విధంగా ఉంటూ, చివరిలో శతృవులను తుదముట్టించే విధంగా మారతాడు.

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ పై ముహూర్తపు షాట్ నుంచి అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ మూవీలో కూడా కుమార్ వర్మ తరహాలో ఓ చిన్న పాత్రను రాజమౌళి క్రియేట్ చేసి,దాన్ని హైలెట్ చేయబోతున్నాడు. ఇంతకీ ఆ పాత్ర పోషించేది ఎవరంటే, రాజీవ్ కనకాల అని అంటున్నారు. వెర్సటైల్ పాత్రల్లో జీవించే రాజీవ్ కనకాలకు రాజమౌళి డైరెక్షన్ తోడవడంతో ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాజీవ్ కనకాల పోషించే పాత్ర ఓ సంచలనం అవుతుందని నిక్కచ్చిగా చెప్పవచ్చు. గతంలో సై మూవీలో కూడా రాజీవ్ కనకాల సినిమాను నడిపించే పాత్రలో నటించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు రాజమౌళి మూవీలో కనిపిస్తున్నాడు. సాఫ్ట్ గా ఉండే రాజీవ్ కనకాల ఇప్పుడు ఈ పాత్ర ద్వారా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. వస్తాద్ లెవెల్లో దర్శన మిస్తున్నాడు. ఇదంతా రాజమౌళి క్రియేషన్ అని చెప్పాలి. మొత్తానికి రాజీవ్ కనకాల ను ఓ రేంజ్ లో చూపించబోతున్నాడు.