Movies

టాప్ సెలబ్రెటీల ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీలు

సినిమా తారలు,నటులు తమ అందాన్ని కాపాడుకోడానికి నానా తంటాలు పడతారు. ఇక మరింత అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం కూడా పరిపాటి అయింది. ప్లాస్టిక్ సర్జరీ వలన ప్రమాదం ఉందని తెలిసినా సరే అందం కాపాడుకోడానికి అటువైపే వెళ్తున్నారు. అందాల నటి శ్రీదేవి మరణం తర్వాత సర్జరీల గురించి చర్చ ఊపందుకుంది. కొంతమంది సర్జరీల వలన ఆరోగ్యం వికటించి మరణం పాలవుతున్నారు. శ్రీదేవి మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ స్టార్ట్ చేసిందని అంటారు.

శ్రీదేవి ముక్కు తేడాగా ఉండడంతో సర్జరీ చేయించుకుని,అందంగా మార్చుకుంది. మూడేళ్ళ క్రితం చేయించుకున్న సర్జరీ,డైట్ కంట్రోల్ గుండెపై ప్రభావం చూపించాయి. ఇక ఆమె అభిమానులకు తీరని విషాదం మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. ఇక ఈమె మరణం కూడా కొంచెం మిస్టరీగానే ఉంది.

విలన్ కారక్టర్లతో రాణిస్తూ కష్టపడి ఎదిగిన శ్రీహరి హీరోగా నిలదొక్కుకున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే తత్త్వం ఉంది. అయితే శ్రీహరికి గుట్కా తీసుకునే అలవాటుంది. దీంతో లివర్ చెడిపోయింది. లివర్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో శ్రీహరి బాగా చిక్కిపోయి కనిపించాడు. ఇక ఆయన తీసుకున్న కొన్ని మెడిసిన్స్ వికటించి, షూటింగ్ సమయంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.

ఇక ఆర్తి అగర్వాల్ అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయింది. తర్వాత పెళ్ళిచేసుకుని సినిమాలు వదిలిసేంది. పెళ్లి తర్వాత లావు అయిపోవడంతో సన్నబడడం కోసం ఆపరేషన్ చేయించుకుంది. అది కాస్తా వికటించి గుండెపోటుతో మరణించింది.

ఇక మైఖేల్ జాక్సన్ డాన్స్ చేసేటపుడు ఓసారి తలకు గాయం అయింది. నొప్పి తట్టుకోడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడంతో గుండె నొప్పికి దారితీసింది. డాన్స్ చేస్తూనే గుండెపోటుతో మరణించాడు.

ఇక దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు వయస్సుతో పాటు ఊబకాయం కూడా పెరుగుతూ వచ్చింది. శరీరాన్ని అదుపులో పెట్టుకోడానికి పేగులకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. అది ఫెయిలవడంతో మరో ఆపరేషన్ అవసరం అయింది. పేగుల్లో చీము చేరడంతో మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ అవ్వడంతో గుండెపోటుకు దారితీసి కన్నుమూశారు