మన హీరోలు, హీరోయిన్స్ ఖాళీ సమయాల్లో చేసే పనులేంటో తెలుసా?
సినిమా వాళ్ళు కూడా మామూలు మనుషులే కనుక వాళ్లకి కష్టాలు,కన్నీళ్లు ,కోరికలు,ఆశలు ఇలా అన్నీ ఉంటాయి. ఇక షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపే హీరోలు,హీరోయిన్స్,సాంకేతిక నిపుణులు ఇలా సినిమా వాళ్లంతా ఖాళీగా ఉంటె బోర్ ఫీలవుతారు. అయితే ఆసమయంలో ఎవరెవరు ఏం చేస్తారో తెలుసా? అది ఓసారి తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ చిన్న పిల్లాడి లాంటివాడు. కోపం వస్తే ఫాన్స్ ని అక్కడక్కడా కొట్టిన సంఘటనలున్నా, వాటిని ఫాన్స్ కూడా పెద్దగా పట్టించుకోరు. ఇక బాలయ్యకు మాన్షన్ హౌస్ మందంటే చాలా ఇష్టం అని కూడా చాలామందికి తెల్సు. ఎప్పుడు పడితే అప్పుడు తాగడట. ఒకవేళ బోర్ కొట్టినట్లు అనిపిస్తే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి,మాట్లాడ్డం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఇబ్బందులు తెలుసుకోవడం చేస్తుంటాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి సినిమాల్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా పుస్తకాలు స్టడీ చేసేవాడు. అయితే ఇప్పుడు తన ముద్దుల తనయుడు గౌతమ్ కృష్ణ,ముద్దుల కూతురు సితారతో కల్సి కబుర్లు చెబుతూ స్కూల్ విశేషాలు అవీ ఇవీ అన్నీ అడిగి తెలుసుకుంటాడు. ఇక పిల్లలకు సెలవలు ఇస్తే,వారితో కల్సి ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తాడు.

ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున కి బోర్ అంటే ఏమిటో తెలియదట. అన్నపూర్ణ స్టూడియోస్ ,అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ యాక్టింగ్,ఇంకా మిగతా వ్యవహారాలు చూసుకునే నాగ్ కి అసలు ఖాళీ దొరకడమే కష్టం. ఒకవేళ ఎప్పుడైనా బోర్ కొట్టినట్లు అనిపిస్తే,అక్కినేని ఓల్డ్ సినిమాలను స్పెషల్ థియేటర్ లో వేయించుకుని చూస్తాడట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు సినిమాలే చూడడు. బోర్ కొట్టకుండా ఉండడానికి ఎప్పుడూ పుస్తకాలు చదవడమే, వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మట్టి తవ్వి,పాదులు వేయడం,మొక్కలు నాటడం,శుభ్రపరచడం వంటి పనులు చేస్తాడు.

ఇతర భాషా చిత్రాలు ఎక్కువగా చూసే వెంకటేష్ బాగా బోర్ కొడితే,ధ్యానం చేస్తాడట. ఇక ఆయనికి ఎంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ ఇన్నింగ్స్ ని యూట్యూబ్ లో చూస్తాడట.

అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి అసలు బోర్ కొట్టదట. ఫ్రెండ్స్ కి అన్నివేళలా దగ్గరగా ఉండడం వలన బోర్ అనే ప్రశ్న రాదట. డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్,డిజైనర్స్ ఇలా అందరూ ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. అందుకే ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తారు.

ఇక యోగా టీచర్ గా ఉండే అనుష్క సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఎన్నో సినిమాల్లో తన సత్తా చాటిన అనుష్క కి బోర్ కొడితే,యోగా చేయదండీ ,పెట్ యానిమల్స్ తో గడుపుతుందట. ఖాళీ దొరికితే కుక్క పిల్లలతో ఆడుకుంటుందట.

దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం తాను నటించే సినిమాలే కాకుండా అసలు ఎవరి సినిమాలు చూడడట. అది అంతే చూడబుద్ది కాదు అంటూ సమాధానం చెప్పేస్తాడట. ఒకవేళ ఎప్పుడైనా బోర్ అనిపిస్తే, మట్టితో దేవుడి విగ్రహాలు చేస్తుంటారు. ఓ ప్రపంచ స్థాయి చిత్రకారుని తరహాలో మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తారట.

