Movies

నటుడు గౌతమ్ రాజ్ కొడుకు హీరోగా సక్సెస్ కావటానికి గౌతమ్ రాజు ఎన్ని పాట్లు పడుతున్నాడో?

మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అని అంటారు కదా. సరిగ్గా నటుడు గౌతమ్ రాజు విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా బాగా రాణించిన గౌతమ్ రాజు ప్రస్తుతం కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,కమెడియన్ సునీల్ లకు మొదట్లో ఆశ్రయం ఇవ్వడమేకాదు,తన పిల్లలకు ట్యూషన్స్ చెప్పమని,అందుకు ప్రతిఫలంగా డబ్బు ఇచ్చేవాడు. అలా వారిద్దరికీ సినిమావాళ్లతో పరిచయం ఏర్పడేలా కూడా దోహదపడ్డాడు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. సునీల్ స్టార్ కమెడియన్ గా, హీగా రాణిస్తున్నాడు.

ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలు కి చెందిన గౌతమ్ రాజు కి భార్య ఝాన్సీ,ఇద్దరు కూతుళ్లు ,ఒక కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి నుంచే రంగస్థలంపై నాటకాలు,నాటికలలో వేస్తూ,నటనపై మక్కువ పెంచుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ లా వున్నావ్ అని అందరూ ఇచ్చే కాంప్లిమెంట్ తో మురిసిపోతూ సినిమాల్లో ఛాన్స్ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

1980లో శ్రీధర్ , సంగీత హీరో హీరోయిన్స్ గా నటించిన పుణ్యభూమి కళ్ళు తెరచింది అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కేరక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతమ్ రాజు కమెడియన్ గానే కాదు భీభత్సం సృష్టించే విలన్ కేరక్టర్ లోనూ అలరించాడు. తేజ వెయ్యి అబద్ధాలు,ఉదయ కిరణ్ జైశ్రీరామ్ మూవీస్ లో విలన్ గా నటించాడు. 1988లో అక్కినేని వసంత గీతం మూవీలో నటిస్తున్న సమయంలో గౌతమ్ రాజు వాయిస్ చాలా బావుందని అంటూ అందరూ చప్పట్లు కొట్టడంతో ఇక వెనక్కి తిరిగిచూడలేదు.

ఘరానామొగుడు,ఇంద్రుడు చంద్రుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల్లో అతడు పండించిన హాస్యం అభిమానుల హృదయాల్లో గౌతమ్ రాజు చెరగని ముద్రవేసుకున్నాడు. ఇప్పటివరకూ 300కి పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. టీవీ సీరియల్స్ కూడా నటించాడు. ఓ సీరియల్ బెస్ట్ హీరోగా నంది అవార్డు అందుకున్నాడు. ఇక హాస్యానికి రేలంగి అవార్డు లభించింది.

ఇక కొడుకు కృష్ణం రాజు ని హీరోగా పరిచయం చేయాలనీ ప్రయత్నం చేసాడు. తండ్రి కృష్ణ ,తన పేరు కల్సి వచ్చేలా, చిరంజీవి అంతటి స్టార్ కావాలని చిరంజీవి కృష్ణంరాజు అని పేరుపెట్టారు. అయితే కమెడియన్ గా సంపాదించిన సొమ్ము పిల్లల చదువుకి అయిపోగా , కొడుకుని హీరోగా పెట్టి ఆ మధ్య లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, నాకైతే నచ్చింది అనే రెండు సినిమాల్లో తీయించాడు.

కానీ అవి ఎప్పుడు వచ్చాయో,ఎప్పుడు పోయాయో తెలీదు. ఇక ఎవరూ సినిమాలు తీయడానికి ముందుకు రాకపోవడంతో గౌతమ్ రాజు నిర్మాతగా మారి, అందరి దగ్గరా అప్పులు చేసి, కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే మూవీ తీస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.