Movies

భానుప్రియ జీవితంలో పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఎన్ని కష్టాలో పాపం…?

కొందరి హీరోయిన్స్ జీవితాలు తెరమీద చూసినంత అందంగా ఉండవు. మామూలు మనుషులే కనుక వాళ్లకి కష్ఠాలు, కడగండ్లు ఉన్నా పైకి కనిపించవు. ఇంట్లో వాళ్ళ వలెనే ఇబ్బందులు పడుతుంటారు. ఆలాంటి వాళ్లలో నటి భానుప్రియ ఒకరు. అందమైన, విశాలమైన కళ్ళతో, తన నృత్యాభినయంతో ఆడియన్స్ ని కట్టిపడేసే నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న భానుప్రియ తెలుగులో సితార మూవీ ద్వారా పరిచయం అయింది. దర్శకుడు వంశీ చిత్రాల్లో ఎక్కువగా నటించిన భానుప్రియ ఆవిధంగా వంశీ చెక్కిన శిల్పంగా ముద్రవేసుకుంది. అయితే అప్పటికే పెళ్లయి పిల్లలున్న వంశీతోనే ప్రేమలో పడి జీవితంలో దెబ్బతీసుకుందని అంటారు. తెలుగులోనే కాదు,తమిళ,మళయాళ,కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించింది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల రూపలావణ్యం ఆమె సొంతం.

పెళ్లయ్యాక,కూతురు పుట్టాక తల్లి పాత్రల్లో కూడా తన నటనతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. భానుప్రియ సినీ జీవితం వినీలాకాశంలో విరబూస్తుంటే, వ్యక్తిగత జీవితం మాత్రం దారుణం. ఆమె తల్లి కూతురిని కనుసైగలతో శాసిస్తూ వంశీని పలుసార్లు అవమానించి దూషించింది. అయితే వంశీ,భానుప్రియ నిజమైన ప్రేమకోసం పోరాటం చేసిన భగ్న ప్రేమికులుగా మిగిలిపోయారని చాలామంది అంటారు. ఐతే 1998లో అన్ని వదిలేసుకొని అమెరికా సంబంధం చేసికుని అక్కడే సెటిల్ అయింది.

NRI కౌశల్ తో పెళ్లి వ్యవహారం కొన్నాళ్ళు సాఫీగానే సాగింది. ఒక పాప కూడా పుట్టాక పరిస్థితి తారుమారైంది. 2003లో విడాకులు తీసుకుని ఇండియా వచ్చేసిన భానుప్రియ మళ్ళీ నటించడం మొదలుపెట్టింది. ఇక భర్త కూడా కొన్నాళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు.తండ్రి చిన్నతనంలో చనిపోవడం, తల్లి కఠిన నియమాలతో కట్టడి మధ్య పెరగడం,బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోవడంతో భానుప్రియ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోయి,మతిస్థిమితం లేని మనిషిగా అయింది.

దీంతో ఆమె మానసిక స్థితిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు కూడా హల్ చల్ చేసాయి. ఏదో చిన్నా చితకా సినిమాలతో ఛాన్స్ లు దక్కించుకుని ఆర్ధికంగా పర్వాలేదని అనుకుంటున్నా తరుణంలో రెండేళ్ల క్రితం ఆమె తమ్ముడికి తమిళ నటి వింధ్యతో సాగిన పెళ్లి విడాకులకు వెళ్ళింది. అలాగే ఆమె సోదరి శాంతిప్రియ కూడా సినిమాల్లో నటించి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె భర్త కూడా చనిపోవడం ఆకుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దెబ్బమీద దెబ్బ లా తల్లి కూడా చనిపోవడంతో భానుప్రియ మరింత డీలా పడింది. తాజాగా ఓ మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకుని వేధిస్తున్నారంటూ కేసు నమోదవడంతో ఒక్కసారిగా వార్తలకు ఎక్కింది. విషాదాల మయంతో జీవితం సాగుతుంటే….