చిరంజీవి,ఎన్టీఆర్,రామ్ చరణ్,అఖిల్….అందరూ దాని బాధితులే…. ఏమిటో తెలుసా?
సినిమా తీయటమే కాదు సినిమాకి పేరు పెట్టటం కూడా ఒక కళే. సినిమా పేరును బట్టి కూడా సినిమా హిట్ అయినా దాఖలాలు ఉన్నాయి. సినిమా పేరులో హీరో పేరు కలిసి వచ్చేలా పెట్టిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు ఆ సినిమాలు,ఆ హీరోల గురించి తెలుసుకుందాం.
రామ్ చరణ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ పేరు కూడా రామ్ చరణ్‌కు ఇలాంటి చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్‌ను మూట గట్టుకుంది. ఈ సినిమా టైటిల్ ‘వినయ విధేయ రామ’లోనే రామ ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదంటున్నారు.
అఖిల్

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది.
నాగార్జున

నాగార్జున నటించిన ‘కెప్టెన్ నాగార్జున’కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అంతేకాదు హీరో పేరే సినిమాకు పెట్టడం పెద్ద రిస్కే అని సిగ్నల్స్ ఇచ్చింది.
మెగా స్టార్ చిరంజీవి

మెగాస్టార్ కూడా ఆయన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన సినిమా కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆయన పేరు కలిసి వచ్చేటట్టు చేసిన ‘జై చిరంజీవా’ కూడా అదే రూట్లో అట్టర్ ఫ్లాపైంది.
మంచు విష్ణు

మంచు విష్ణు కూడా ‘విష్ణు’ టైటిల్ తో చేసిన ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పేరు కలిసొచ్చేలా చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయలేక చేతులేత్తేసింది.

