Movies

ఎన్టీఆర్ కార్ కి, కార్ నెంబర్ కి ఎంత చరిత్ర ఉందో తెలిస్తే షాకవుతారు

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినీ ఎంట్రీ 1950లో మొదలై,1980వరకూ జైత్ర యాత్ర నిర్విరామంగా సాగింది. మొదటి మూడేళ్లు అగ్రిమెంట్ లో విజయ వాహినితో నడిచింది. ఆతర్వాత 1953లో ఏవిఎం లో అమ్మలక్కలు మూవీ తో స్టార్ట్ అయింది. అయితే అప్పటిదాకా ఆయనకు సొంత వాహనం కూడా లేదు. నడుచుకుంటూనో,సహనటుల కారులలోనో షూటింగ్స్ కి వెళ్లేవారు. అయితే అమ్మలక్కలు మూవీకి చెట్టియార్ అనే ఫైన్షియర్ ఉండేవారు. ఎన్టీఆర్ ని అయన అడిగి మరీ కారులేదని తెలుసుకుని ,అప్పటికే మార్కెట్ లో బాగా పేరున్న మోల్స్ మైనర్ అనే కారుని 7,500కి కొని తాళాలు ఎన్టీఆర్ ఇంటికి పంపేసారట.

నిజానికి ఒక సినిమా రెమ్యునరేషన్ కూడా 7,500కావడం విశేషం. అలా మొదటి సొంత కారు ప్రయాణం మొదలై,రెగ్యులర్ గా అదే కారులో ఎన్టీఆర్ షూటింగ్ కి వెళ్లేవారు. క్యాడిక్,బ్యుక్ వంటి కార్లను ఆతర్వాత ఎన్టీఆర్ కొనుగోలు చేసి వాడేవారు. ఇక సీఎం అయ్యిన దగ్గర నుంచి చివరి రోజుల వరకూ ‘ ఏ బివై 9999’నెంబర్ అంబాసిడర్ కారుని ఇష్టంగా వాడుకున్నారు. ఎన్టీఆర్ మరణించిన ఏడాది తర్వాత ఇదే కారులో తాతగారి జ్ఞాపకార్ధం ఇంట్లోనే భద్రపరిచారు. ఆయన ఇంటి దగ్గర కనిపిస్తుంది.

ఇక 9999 నెంబర్ ని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన బిఎం డబ్ల్యు కారుకి ‘ టి ఎస్ 09ఇఎల్ 9999’నెంబర్ కోసం ఏకంగా 11లక్షలు చెల్లించాడు. ఇలా ఎన్టీఆర్ సెంటిమెంట్ జూనియర్ ఎన్టీఆర్ కొనసాగించడం విశేషం.