హీరోయిన్ మాలాశ్రీ ‘చెల్లెలు’ కూడా స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ సిస్టర్స్ చాలామంది ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చారు. జయసుధ సిస్టర్ సుభాషిణి మొదలుకుని రాధ,అంబికా, ఇలా ఎందరో హీరోయిన్స్ సిస్టర్స్ ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా చాటారు. అందులో స్టార్ హీరోయిన్ మాలాశ్రీ సోదరి కూడా వుంది. అందులో అప్పటి స్టార్ హీరోయిన్ మాలాశ్రీ అనగానే ప్రేమఖైదీ మూవీలో హరీష్ ని ఆటపట్టించిన అమ్మాయి గుర్తొస్తుంది. ఇక ఆమె చెల్లెలు శుభశ్రీ కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే కెరీర్ లో దూసుకెళుతున్న సమయంలో ఆమె చేసిన పొరపాటు ఆమెను వెనక్కి నెట్టేసింది. దాంతో సినీ ఇండస్ట్రీకి ఆమె దూరం అయింది. కాగా మాలాశ్రీ బాలనటిగా తెలుగు ,తమిళ్ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి,మెప్పించింది.
ఇక పెద్దాయ్యాక కన్నడ సినిమా నంజుడి కల్యాణ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాలాశ్రీ అల్లరిపిల్ల పాత్రలో మెప్పించి,ఆతర్వాత స్టార్ హీరోయిన్ సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. 1980-90దశకంలో ఈమె నటించిన ప్రతి కన్నడ సినిమా హిట్ గా మారిపోవడంతో లక్కీ స్టార్ అనే పేరుకూడా తెచ్చుకుంది. అంతేకాదు, కన్నడ రంగంలో యాక్షన్ హీరోయిన్ పాత్రకు పెట్టింది పేరుగా నిల్చి, లేడీ సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీగా అనిపించుకుంది.
తెలుగులో ప్రేమ ఖైదీ, పరువు ప్రతిష్ట,బావమరిది,ఊర్మిళ,తోడికోడళ్లు,బంగారు మొగుడు వంటి సినిమాలతో తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక మాలాశ్రీ చెల్లెలు శుభశ్రీ కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ రీమేక్ మూవీ జెంటిల్ మెన్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈమె గ్లామరస్ పాత్రలకు అతికినట్లు ఉండేది.
తెలుగులో పెదరాయుడు,పుణ్యభూమి నాదేశం,ఊహ వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎన్నో హిట్స్ కొట్టిన శుభాశ్రీ కెరీర్ అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. జెంటిల్ మెన్ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయ్యారు. అయితే ఆ తర్వాత ఆమెను జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. అది ఏమిటంటే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీలో నటించడమే ఆమె చేసిన పొరపాటని అంటారు.
నిజానికి రజనీ పక్కన నటించడమే చాలా గొప్ప విషయం. రజనీతో వచ్చిన ఛాన్స్ తో ముత్తు మూవీలో శరత్ బాబు పక్కన నటించడంతో శుభశ్రీ ఇమేజ్ డౌన్ అయిపొయింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిల్చి,శుభశ్రీ కి గుర్తింపు బాగానే వచ్చినా,ఛాన్స్ లు మాత్రం ఆగిపోయాయి.