శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూడండి
శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 05 అవమానం – 02.కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహ ప్రభావం వలన 03-నవంబర్-2019 వరకూ భూసంబంధమైన , గృహ సంబంధమైన వ్యవహారాలలో చక్కటి లాభాలను కలుగచేయును. 04-నవంబర్-2019 నుండి గురువు కలసి రాడు. కొన్ని ఆరోగ్య సమస్యలను కలుగచేయును. వ్యవహారములందు తగాదాలు ఏర్పడుచుండును. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను కలుగచేయును.

చేసే పనిలో విజయం లభించిన సంతృప్తి ఉండదు. సమాజంలో కాస్త గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు కలుగుతాయి. అలాగే అనుకున్న వ్యాపార లక్ష్యాలను చేరుకొనుట కష్టం. వ్యాపారం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది . మిత్రుల మీద భాద్యతలు పెట్టుట వలన నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్ధులు కాస్త కష్టపడాలి. రాహు – కేతు దోషాలు కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శని కూడా ఈ రాశివారికి అనుకూలంగా లేకపోవుట వలన కొన్ని సమస్యలు,ఇబ్బందులు వస్తాయి.

