అనిల్ రావిపూడి గురించి మనకు తెలియని నిజాలు… ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. సినిమా హిట్ అయితే ఒకలాగా, లేకపోతె మరోలా ట్రీట్ చేయడం ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. కొందరైతే జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోతుంటారు. కానీ చాలామంది పరిస్థితి మాత్రం హిట్,ప్లాప్ ల పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే కొత్తవాళ్లు వస్తుంటే పాతవాళ్లకు కాలం చెల్లినట్లే అన్నట్లు ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో మెగా హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చిందే తడవుగా సక్సెస్ లోకి వచ్చిన అనిల్ ఎవరో కాదు ఓ సదా సీదా డ్రైవర్ కొడుకు అంటే ఆశ్చర్యం కలగక మానదు.

ప్రకాశం జిల్లా చిలుకూరువారిపాలెంలో 1982నవంబర్ 23న జనించిన అనిల్ చిన్నతనంలోనే అతడి పేరెంట్స్ మహబూబ్ నగర్ జిల్లా అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేశారట. చిన్నప్పటినుంచి సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా అనిల్ కి ఉండేదట. ఇక తండ్రికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. దీంతో అద్దంకి వచ్చేశారట. ఎప్పుడో పొద్దున్న పోయి అర్ధరాత్రి వచ్చే తండ్రి కష్టాన్ని చిన్నతనం నుంచే గమనించి ఆకళింపు చేసుకున్న అనిల్ 10వ తరగతి వరకూ అద్దంకి లో చదివి, ఇంటర్ గుంటూరులో చదివాడట.

వడ్లమూరులో ఎలక్ట్రానిక్స్ ,కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసాడు. అయితే ఉద్యోగంలో చేరతాడని అనుకుంటే తండ్రిని ఒప్పించి మూడునెలల సమయం తీసుకుని అనిల్ ఇండస్ట్రీకి వచ్చాడట. తనకు మేనమామ అయిన డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ దగ్గర అనిల్ అసిస్టెంట్ గా చేరి, పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

2008లో సౌర్యం మూవీతో డైలాగ్ రైటర్ అయ్యాడు. 2009లో కందిరీగ మూవీతో డైలాగ్ రైటర్ గా గుర్తింపు పొందిన అనిల్ కి 2013లో మసాలా సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే నిరాకరించాడు.శ్రీను వైట్ల దగ్గర స్క్రిప్ట్ రైటర్,కం డైలాగ్ రైటర్ గా ఆగడు మూవీకి ఒప్పుకున్నా పూర్తిగా పనిచేయలేదు. పైగా తన ఫ్రెండ్ ద్వారా కళ్యాణ్ రామ్ ని కల్సి కథ చెప్పేసి, పటాస్ మూవీతో డైరెక్టర్ గా బిజీ అయ్యాడు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో మైల్ రాయిగా నిల్చింది.

పండగ చేస్కో మూవీకి డైలాగ్ రైటర్ గా చేసాడు. ఇక దిల్ రాజు నిర్మించిన సాయిధర్మ తేజ హీరోగా సుప్రీం సినిమాకు ఛాన్స్ ఇవ్వడంతో అది కూడా హిట్ కొట్టింది. రవితేజా రాజాదిగ్రేట్ మూవీతో ఇంకో హిట్ కొట్టిన అనిల్, ఇక రీసెంట్ గా ఎఫ్ 2తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. వందకోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

