Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?

శ్రీ వికారి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 04 అవమానం – 05.శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహ ప్రభావం వలన 03-నవంబర్-2019 వరకూ చెడు ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య విషయములందు తల్లితండ్రులు జాగ్రత్త వహించవలెను. 04-నవంబర్-2019 నుండి చక్కటి ఫలితాలు ఏర్పరచును. విద్యార్ధ్యులకు ఆశించినఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారికి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో సమస్యలు తొలగిపోయి నూతన ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి.

వ్యాపారంలో భాగస్వామ్యం కలిసి వస్తుంది. సంపాదన విషయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతుతో ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవనములో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సౌఖ్యం తగ్గును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. కష్టించ వలసిన అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు పెట్టుబడికి మించి ఆదాయం లభించును. శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన పిత్రార్జితం కొంత వ్యయం అగును. 24-జనవరి-2020 నుండి ఆర్ధికంగా బాగా యోగించును. రాహు – కేతువుల వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుచుండును.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."