Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?

శ్రీ వికారి నామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 01 అవమానం – 04. సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయలందు మంచి ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన వ్యవహారాలలో విజయం పొందును. విద్యార్ధులకు కొంచెం కష్టకాలం. కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనులున్ని సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులు కలిసి ఉండాలంటే కాస్త సహనం ఉండాలి. ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఉన్నా కాలం గడిచే కొద్దీ సర్దుకుంటాయి.

వైవాహిక జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ సొంత ఆలోచనలతో మాత్రమే చేయాలి. ఇతరుల సలహాను పాటించకుండా ఉంటేనే మంచిది. జీవిత భాగస్వామి వలన ధన విషయాలందు లాభం ఏర్పడును. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు మంచి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగాబాగుంటుంది. రాహు – కేతువుల వలన చక్కటి ఆర్ధిక పురోగతి ఏర్పడును.