Politics

రకుల్‌ అప్పుడు NO , ఇప్పుడు YES – అసలు కారణం ఇదే… ఆ హీరో ఎవరో?

హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ళ బిజీని బట్టి కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేస్తారు. ఇది ఒక్కోసారి కొంతమందికి ఇబ్బందిగా మారిపోతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, 2016 – 2017లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత బిజీగా ఉందంటే మహేష్‌బాబు మూవీకి కూడా నో చెప్పేసింది. కాని రకుల్‌ ప్రభావం ఆ రెండేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత నుండి ఆమె క్రేజ్‌ మెల్ల మెల్లగా తగ్గింది. 2017వ సంవత్సరంలో బాలకృష్ణతో ఒక మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని అప్పుడు రకుల్‌ అబ్బే మరీ అంత సీనియర్‌ హీరోతో నేను సెట్‌ అవ్వను, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, డేట్లు లేవు అంటూ సిల్లీ రీజన్స్‌ తో నో అనేసింది. కట్‌ చేస్తే ఇప్పుడు బాలయ్యకు జోడీ కడుతోంది.

ఫిలిం వర్గాల నుంచి వినిపిస్తున్న మాటల ప్రకారం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సెలెక్ట్ చేశారట. అందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయినట్లు టాక్. తెలుగులో రకుల్‌ ఇటీవల ‘కథానాయకుడు’ చిత్రంలో నటించింది తప్ప మరే సినిమాకు కమిట్‌ అవ్వలేదు. నిజానికి ఆమెకు అసలు ఆఫర్‌ రాలేదు.

దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వచ్చిన అవకాశం మిస్‌ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే బాలయ్య మూవీకి ఓకే అనేసిందని అంటున్నారు. తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగులో బాలయ్య మూవీతో ఆడియన్స్ ముందుకి వస్తుందట. ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి మూవీలో బాలకృష్ణ యాక్ట్ చేస్తాడు.

అయితే ఫాన్స్ వెర్షన్ మరోలా ఉంది. అసలు గతంలో బాలయ్యకు నో చెప్పిన రకుల్ ని మళ్లీ ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసారని బోయపాటిపై నందమూరి ఫాన్స్ సీరియస్‌ అవుతున్నారు. అంతేకాదు, కొందరు అభిమానులు ఓ అడుగు ముందుకేసి, ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య ఆమెను ఒప్పుకోవద్దని సోషల్‌ మీడియాలో వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు.

కాని రకుల్‌ విషయంలో బాలయ్య ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో శ్రీదేవిగా నటించి మెప్పించింది కనుకే బాలయ్య ఈమెకు తన తర్వాత సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. మరి ఫాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.