Movies

నంద‌మూరి మోక్ష‌జ్ఞ కొత్త లుక్ చూస్తే షాక్ అవ్వాలసిందే

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో చాలామంది వార‌సులు రంగప్రవేశం చేసారు. ఇంకా చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన మ‌హేశ్ 25 ఏళ్ల‌కు సినిమాల్లో హీరోగా అరంగేట్రం చేసాడు. రామ్ చ‌ర‌ణ్ 21 ఏళ్ల‌కు “చిరుత‌” మూవీతో ఎంట్రీ ఇస్తే, బ‌న్నీ 20 ఏళ్ల‌కు “గంగోత్రి”తో అలాగే ప్ర‌భాస్ 22 ఏళ్ల‌కు “ఈశ్వ‌ర్” తో ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ 20 ఏళ్ల‌కే “అఖిల్”మూవీతొ వచ్చాడు. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల‌కే “నిన్ను చూడాల‌ని”మూవీతో ఎంట్రీ ఇచ్చేసాడు. ఇలా ప్ర‌తీ హీరో చాలా త‌క్కువ వయసులోనే వ‌చ్చారు. దాంతో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా త్వ‌ర‌లోనే వార‌సున్ని ప‌రిచ‌యం చేస్తానంటున్నాడు. ఈనేపధ్యంలో మోక్షజ్ఞ కొత్త లుక్ బయటకొచ్చింది.

సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న లుక్ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు . ఎందుకంటే, ఈ వంశం నుంచి హీరో వ‌చ్చి 13సంవత్సరాలు అయింది. క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, ఇక బాల‌య్య కూడా ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు.

గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయిందన్న మాట వినిపిస్తోంది. అందుకే బాలయ్య నట వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని భావిస్తున్న మోక్షజ్ఞ 21 ఏట అడుగు పెట్టాడు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే,సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి అనుగుణంగా ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ న‌ట‌న‌తో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడని అంటున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ప‌నుల్లో బిజీగా ఉన్న ద‌ర్శ‌కుడు క్రిష్ ఆ త‌ర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ కోసం క‌థ‌పై దృష్టి పెట్ట‌నున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వెంకీ, మ‌హేష్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యులు ఇంకా చిన్నోళ్లే కావ‌డంతో మోక్ష‌జ్ఞ‌పైనే ఇప్పుడు అంద‌రి దృష్టి పడింది. నందమూరి వార‌సుడు వ‌స్తే మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో వార‌సుల ఎంట్రీ ఉండ‌దని అంచనా వేస్తున్నారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో.