Movies

అక్కినేని వారసుడు మళ్ళీ రాంగ్ రూట్ లోకి వెళ్లుతున్నాడా?

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను ప్లాప్ కాగా ఇప్పుడు మరో తప్పు చేస్తున్నాడు . ఇప్పటికే ప్లాప్ లతో సతమతం అవుతున్న అఖిల్ ఇప్పుడు చేసే సినిమా మంచి డైరెక్టర్ తో చేయాలి కానీ బొమ్మరిల్లు భాస్కర్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు అని తెలుస్తోంది . ఒకవేళ ఇదే నిజమైతే అఖిల్ చేస్తున్న మరో ఘోరమైన తప్పు ఇదే అవుతుంది .

బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు , పరుగు చిత్రాలు తప్ప మిగతా సినిమాలన్నీ ఘోర పరాజయాలు అందుకున్నవే ! అంతేకాదు గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సినిమాలు లేనే లేవు కూడా . అలాంటిది బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా చేయడం అంటే చేజేతులా మరో ప్లాప్ అందుకోవడమే ! కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా పోయి పోయి ప్లాప్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఏంటో మరి .