Business

వరల్డ్ క్లాస్ బిలియనీర్స్ సెక్యూరిటీ ఖర్చు తెలిస్తే గుండె గుభేల్ మంటుంది

ఒకప్పుడు రాజులు ,రాజ్యాలు ఉన్నప్పుడు సైనికులు ఎక్కువే ఉండేవారు. ప్రజా రక్షణతో పాటు రాజులకు భద్రతగా సైనికులు ఉండేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. రాజులు, రాజ్యాలు స్థానంలో అపర కుబేరులు వచ్చి చేరారు. లక్షల కోట్లకు అధిపతులు అవుతున్నవాళ్లు తమ భద్రతకు కూడా భారీగానే వెచ్చిస్తున్నారు. తమ లావాదేవీలు నిర్వహించే డిజిటల్ సెక్యూరిటీ,భౌతిక దాడులనుంచి తప్పించుకోడానికి వ్యక్తిగత భద్రత పై ఎక్కువగా కుబేరులు దృష్టి సారిస్తున్నారు. ఇలా వరల్డ్ క్లాస్ బిలియనీర్స్ భద్రత పేరిట ఎంతెంత ఖర్చు చేస్తున్నారో చూద్దాం.

సైబర్ నిపుణులు, మాజీ కమెండోలు,మాజీ ఆర్మీ అధికారులను ఇలా భద్రతకోసం కోట్లు వెచ్చించి పెట్టుకుంటున్నారు. ఫేస్ బుక్ అధినేత Mark Zuckerberg ఆస్తుల విలువ నాలుగు లక్షల కోట్ల రూపాయలు. ఇక ఆయన వ్యక్తిగత భద్రతకోసం ప్రపంచంలో ఏ సంపన్నుడు ఖర్చు చేయని విధంగా Mark Zuckerberg ఖర్చు పెడ్తున్నాడు. ఏడాది కి కేవలం వ్యక్తిగత భద్రత కోసం 49కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

ఇక అమెజాన్ అధినేత Jeff Bezos నికర ఆస్తి 9లక్షల కోట్లు. వరల్డ్ లోనే అతి పెద్ద కుబేరుడు అయిన ఈయన గత ఏడాదికి సెక్యూరిటీకోసం 11కోట్లు వెచ్చించాడు.

వరల్డ్ ఫేమస్ మార్కెట్ నిపుణుడు warren buffett తన సెక్యూరిటీకి ఏడాదికి మూడు కోట్ల రూపాయలు ఖర్చుపెడ్తున్నారు.

మరి భారత్ లో నెంబర్ వన్ బిలియనీర్ ముఖేష్ అంబానీ 2018లో భద్రత నిమిత్తం ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాడు.

ఆపిల్ కంపెనీ సిఇవో Tim Cook కూడా వ్యక్తిగత భద్రత కోసం ఒకటిన్నర కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాడు.

ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఆలీబాబా వ్యవస్థాపకుడు Jack Ma ఏడాదికి కోటి రూపాయల వరకూ వ్యక్తిగత భద్రతకోసం చెల్లిస్తున్నాడు.