Movies

‘గల్లీబాయ్’ ను మెగా వారసుడు రీమేక్‌ చేస్తాడట ….. సాహసం అవుతుందా?

ఒక్కోసారి సినిమాల్లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు బయోపిక్ లు,రీమేక్ లు ,సీక్వెల్స్ కామన్ అయిపోయాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఏ భాషలోనైనా ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా హిట్ కొట్టింది. జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన ఈమూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘గల్లీ బాయ్’ సినిమా త్వరలో రూ.100 కోట్ల క్లబ్బులో చేరడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో మెగా వారసుడు ఉన్నట్లు తెలుస్తోంది. అవును. ఈ సినిమాను తెలుగులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్‌తో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.

ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ దక్కించుకున్నాడట. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే, ఈ సినిమాతో సాయి ధర్మ తేజ్ దశ తిరుగుతుందా లేదా అనేది చూడాలి.